పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

ధర్మపురి: పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలని ధర్మపురి జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి జానకీ అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలన్నారు. గ్లాసులు, కవర్లు, ప్లేట్స్‌తో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, వాటి స్థానంలో స్టీల్‌ప్లేట్స్‌, గ్లాసులు, జ్యూట్‌బ్యాగులు వినియోగించుకోవాలని కోరారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బందెల రమేశ్‌, ఉపాధ్యక్షుడు మామిడాల శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి రామడుగు రాజేశ్‌, అసిస్టెంట్‌ ప్లీడర్‌ ఇమ్మడి శ్రీనివాస్‌, లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ జాజాల రమేశ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement