జగిత్యాల: మున్సిపాలిటీలను పరిశుభ్రంగా ఉంచేందుకు వేకువ జామునే విధుల్లోకి దిగే మున్సిపల్ కార్మికులకు భరోసా కరువైంది. రోడ్లపై చెత్త సేకరణ మొదలు.. మురికి కాల్వల శుభ్రత వరకు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న వీరికి తగిన బీమా సౌకర్యం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. విధి నిర్వహణలో ప్రమాదం జరిగితే వారి కుటుంబా లకు ఆర్థిక భరోసా ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
ప్రమాదకర విధుల్లో కార్మికులు
పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే డ్రైనేజీలు శు భ్రంగా ఉండాలి. దీనికి కార్మికులే కాలువల్లోకి దిగి సిల్ట్ తొలగించాలి. ఇతర వ్యర్థాలు సేకరించాలి. ఇలాంటి పనులకు చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు ఉండాలి. కానీ.. కార్మికులు ఏవీమీ లేకున్నా పనిచేస్తున్నారు. బల్దియాలను క్లీన్‌అండ్ గ్రీన్‌గా ఉంచుతున్నారు. వారు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం ఆదాయ వనరులను కోల్పోతుంది. అలాంటి సందర్భంలో బీమా లేకుంటే పూట గడవడం కష్టతరంగా మారుతుంది.
పరికరాలెక్కడ..?
కార్మికులకు ఏటా నూనెలు, సబ్బులు, ఆర్పన్స్, డ్రె స్సులు, టార్చిలైట్లు, షూస్, మురికి కాల్వలను శు భ్రం చేయడానికి అవసరమైన పారలు, గడ్డపారలు ఇవ్వాలి. అయితే బల్దియాల్లో వా టి ని సక్రమంగా ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
బీమా సౌకర్యం కల్పించాలి
కార్మికులందరికీ గ్రూపు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించాలని కార్మిక సంఘాలు, ఉద్యోగులు కోరుతున్నారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగితే తక్షణ ఆర్థిక సహాయం అందేలా నిబంధలు రూపొందించాలంటున్నారు. పీఎఫ్‌పాటు, ప్రమాద బీమాను తప్పనిసరి చేస్తే కార్మికుల కుటుంబాలకు భరోసా కలుగుతుంది.
మహిళా సంఘాల ద్వారా జీతాలు
కార్మికులకు మహిళా సంఘాల ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. పీఎఫ్ ఇతర ప్రయోజనాలకు సంబంధించి వారి జీతం నుంచి కొంత మొత్తం కోత విధిస్తున్నారు. అయితే ప్రమాద బీమాపై స్పష్టత లేకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. మున్సిపాలిటీల్లో జాతీయ బ్యాంకుల్లో ఖాతా లేవు. ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు ఉండడంతో ప్రయోజనం పొందలేకపోతున్నారు.
దయనీయంగా కాంట్రాక్ట్ కార్మికుల దుస్థితి


