● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి
జగిత్యాలజోన్: న్యాయ, పోలీసు వ్యవస్థల సమన్వయంతోనే కోర్టుల్లో సకాలంలో తీర్పులు వస్తున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావ తి అన్నారు. జిల్లా కోర్టులో పోలీస్, న్యాయశాఖ అధికారులతో సమావేశమయ్యారు. క్రిమినల్ కేసుల్లో వాయిదాలు కోరకుండా సాక్షులను సకాలంలో హాజరుపర్చితే జడ్జిలు తీర్పు ఇచ్చే వీలుంటుందని వివరించారు. లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారంలో జిల్లా ముందంజలో ఉందన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. కోర్టులకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిని అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్లాస్టిక్ నివారణ అందరి బాధ్యత
ప్లాస్టిక్ నివారణ అందరి బాధ్యత అని రత్నపద్మావతి అన్నారు. న్యాయవాదులు, కక్షిదారులకు జ్యూ ట్ బ్యాగులు పంపిణీ చేశారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సునీత, సబ్ జడ్జి నాగేశ్వర్‌రావు, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సయ్య పాల్గొన్నారు.


