నామినేటెడ్‌ వద్దు.. ఎన్నికలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ వద్దు.. ఎన్నికలు నిర్వహించాలి

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

జగిత్యాలఅగ్రికల్చర్‌: సహకార ఎన్నికలను నామినేటెడ్‌ పద్ధతిలో కాకుండా ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సహకార సంఘాల అధ్యక్షులను నామినేటెడ్‌ పద్ధతిలో తీసుకవచ్చేందుకు ప్రభుత్వం తీసుకవచ్చిన జీవో నం.432ను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. రైతుల భాగస్వామ్యంతో నడవాల్సిన సహకార సంఘాలను ప్రభుత్వం తన పెత్తనంలోకి తీసుకోవడాన్ని దుయ్యబట్టారు. జీవో 432ను ఉప సంహరించుకోకపోతే న్యాయస్థానాలకు వెళ్లడంతో పాటు రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సహకార సంఘాల ఫోరం జిల్లా చైర్మన్‌ రాజ సుమన్‌రావు, సంఘాల అధ్యక్షులు సాగర్‌రావు, మహిపాల్‌ రెడ్డి, మధుసూధన్‌రావు, మాధవరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement