కథలాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ మండలం సిరికొండ, ఇప్పపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించి సిరికొండ జెడ్పీహైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అసహనం వ్యక్తం చేసి భోజనం రుచికరంగా వండేలా చర్యలు తీసుకోవాలని డీఈవో రామును ఆదేశించారు. తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచాలని, పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి శానిటేషన్ చేయించాలని సూచించారు. ప్రతీ తరగతిలో ఎంత మంది విద్యార్థులున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పపెల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, డీపీవో మదన్‌మోహన్, డీఈవో రాము, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శంకర్, ఎంఈవో శ్రీనివాస్, సర్పంచులు ముదాం రవి, సంబ నవీన్ పాల్గొన్నారు.
జాతీయ డిజిటల్ పశుసంపద
మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
జగిత్యాల: జిల్లాలో 10 రోజుల్లో వందశాతం జాతీ య డిజిటల్ పశుసంపద మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవా రం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇప్పటివరకు పశువుల డేటా క్యాప్చర్ ప్రక్రియ 78 శాతం పూర్తయిందని, మిగతా 28 శాతం డేటాను క్షేత్రస్థాయిలో వేగవంతంగా నమోదు చేసి పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి ప్రకాశ్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో మదన్‌మోహన్, డీఏవో భాస్కర్ పాల్గొన్నారు.
‘స్వచ్ఛత హీ సేవా’ విజయవంతం చేయాలి
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవా రం జగిత్యాలలో స్వచ్ఛత హీ సేవకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. స్వచ్ఛతను ప్రతి ఒ క్కరూ బాధ్యతగా భావించి పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణానికి భాగస్వాములు కావాలని అన్నారు.
అర్హులందరికీ ఓటు హక్కు కల్పించటమే లక్ష్యం
కోరుట్ల: అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించటమే ఎన్నికల కమిషన్ లక్ష్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. నోటీసులు, వాటిపై నిర్వహిస్తున్న విచారణ, ఓటర్ల నుంచి సేకరిస్తున్న ఆధారాలు, ఆన్‌లైన్ నమోదు విదానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులపై నిబంధనల ప్రకారం విచారణ నిర్వహించాలని ఆదేశించారు. ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, మున్సిపల్ అదికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్


