జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని, మ్యాప్‌ను పరిశీలించారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు ఒకే ప్రాంగణంలో అందించడమే లక్ష్యమన్నారు. 2500 మంది విద్యార్థులు, 300 మంది సిబ్బందికి అనుగుణంగా జీ+3 పద్ధతిలో సకల సదుపాయాలతో భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. మోరం అమ్ముకుంటున్నారంటూ కొందరు నాయకులు బురదజల్లడం మానుకోవాలని, అభివృద్ధికి అడ్డుపడవద్దని హితవు పలికారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఎండీ గణపతిరెడ్డి, సీఈ లక్ష్మారెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల పనులను
త్వరితగతిన పూర్తి చేయాలి
జగిత్యాల: మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ధరూర్ క్యాంప్‌లో మెడికల్ కళాశాల నూతన రహదారులు, తాగునీటి ట్యాంక్‌లు, పైప్‌లైన్ పనులను పరిశీలించారు. మెడికల్ కళాశాలతో పాటు, అత్యవసర పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కమిషనర్ సత్యప్రసాద్, ఆర్‌అండ్‌బీ డీఈ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, శంకర్, సతీశ్, దుమాల రాజ్‌కుమార్, ప్రశాంత్‌రావు పాల్గొన్నారు.
పోరాట యోధుడు సర్దార్ సర్వాయిపాపన్న
రాయికల్: పోరాట స్పూర్తి, సామాజిక సమానత్వం కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం రాయికల్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్లు పల్లికొండ గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రావు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.


