జగిత్యాలరూరల్: క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకునేందుకు పోషకాహారం ఎంతో అవసరమని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జగిత్యాలరూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రమాదేవితో కలిసి టీబీ రోగులకు పౌష్టికాహార మద్దతు, నిక్షయ్ మిత్ర రిజిస్ట్రేషన్లపై సిబ్బందితో చర్చించారు. రోగులకు అండగా నిలిచేందుకు దాతలను ప్రోత్సహించి, వారిని నిక్షయ్ మిత్రలో భాగస్వాములను చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసి రోగులకు పోషకాహారం అందేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.


