గ్రామాల్లోనూ పెరుగుతున్న వినియోగం విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయం ఈ ఏడాది 78మందిపై 35 కేసులు నమోదు 6.153 కిలోల గంజాయి స్వాధీనం
జిల్లా పోలీసులు గంజాయి విక్రేతలు, సేవించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 78 మందిపై 35 కేసులు నమోదు చేశారు. అలాగే వారి వద్ద నుంచి 6.153 కిలోల గంజాయి, నాలుగు గంజాయి మొక్కలను సీజ్ చేశారు.
అవగాహన సదస్సులు
యువత గంజాయి మత్తుకు బానిస కావద్దని, భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు 189 కమిటీలు ఏర్పాటు చేసి, 235 సదస్సులు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో కూడా వివరిస్తున్నారు.
ఇతర జిల్లాల నుంచి సరఫరా
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యంలోని ఊట్నూరు, జైనూరు, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి, కాసిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో గంజాయిని అంతరపంటగా సాగు చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో సాగవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రహస్యంగా జగిత్యాల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి, మల్యాల, గొల్లపల్లి, కోరుట్ల మీదుగా జిల్లాలో అనేక గ్రామాలకు చేరవేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా మానాల నుంచి గంజాయి కోరుట్ల, మెట్‌పల్లి మండలాలకు చేరుతోంది. ము ఖ్యంగా గంజాయ్ విక్రయదారులు తెలిసిన వారికి, పరిచయస్తులకు మాత్రమే విక్రయిస్తారు.
గంజాయి అమ్మకాలు ఇలా..
కీలకవ్యక్తులపై పోలీసుల నిఘా
కొద్దికాలంగా పోలీసులు గంజాయి, మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పోలీసు బృందాలతో కీలకవ్యక్తుల కోసం నిఘా పెంచారు. గంజాయి సేవిస్తున్న వారితోపాటు రవాణా చేస్తున్న వారి వివరాలనూ సేకరించి వేట కొనసాగిస్తున్నారు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఓపెన్ డ్రింకింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు డ్రంకెన్‌డ్రైవ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
జగిత్యాలక్రైం:జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. యువత మత్తులో జోగుతోంది. బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటోంది. కళాశాల విద్యార్థులే కాదు.. స్కూల్‌కు వెళ్తున్న చిన్నారులూ ఈ మత్తుకు బానిసలవుతున్నారు. ముందుగా తక్కువ ధరకు గంజాయి విక్రయిస్తున్న అక్రమార్కులు.. విద్యార్థులు, యువత ఆకర్షితులయ్యాక రేట్లు పెంచేస్తున్నారు. సిగరెట్లలో గంజాయి నింపి చిన్న సిగరేట్‌కు రూ.100, పెద్ద సిగరేటుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. ధర తక్కువగా ఉందని అందరూ సిగరెట్ల వైపు ఆకర్షితులవుతున్నారు. తర్వాత విక్రయదారులు ధరను రెండింతలు పెంచి రూ.వేలు సంపాదిస్తున్నారు. వాస్తవానికి గంజాయి గోధుమ, ఆకుపచ్చరంగులో ఉంటుంది. ఇందులో గోధుమ రంగు నాణ్యత కలిగిన గంజాయిగా మార్కెట్‌లో గుర్తింపు పొందింది.


