జగిత్యాలక్రైం: జిల్లాలోని పలువురు వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను పోలీసులు సీఈఐఆర్ యాప్ ద్వారా గుర్తించి బాధితులకు బుధవా రం అప్పగించారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పోగొట్టుకున్న, చోరీకి గురైన సుమారు రూ.21 లక్షల విలువైన 102 ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. సెల్‌ఫోన్ల రికవరీ కోసం సీఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్, ఇ ద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.4.5 కోట్ల విలువైన 2024 ఫోన్లను బాధితులకు అందించమన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసానికి గురైతే సైబర్ క్రైం హెల్ప్ లైన్‌నంబర్ 1930కు ఫోన్ చేయాలని కోరారు. అదనపు ఎస్పీ చే తన్ నితిన్, ఐటి కోర్ సీఐ శ్రీనివాస్, సైబర్‌క్రైం ఎస్సై కృష్ణ, సీఈఐఆర్ టీం హెడ్ కానిస్టేబుల్ మ హుముద్, కానిస్టేబుళ్లు మల్లేశం, అజర్, అనూష, ప్రశాంత్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
కథలాపూర్: పర్యావరణ పరిరక్షణకు అందరం కృషి చేద్దామని కేజీబీవీ ప్రత్యేకాధికారి లావణ్య అన్నారు. బుధవారం కథలాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ‘మదర్ ట్రీ’ కార్యక్రమం నిర్వహించారు. పచ్చని చెట్లను అమ్మ లాగా భావించాలన్నారు. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్న ప్లాస్టిక్ వస్తువులను వినియోగించవద్దన్నారు. ప్రకృతిని కాపాడుకుందామని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు.
కొండగట్టులో ముగిసిన శ్రావణ సప్తాహం
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ సప్తాహం ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ఆలయ అర్చకులు అష్టోత్తర కలశాభిషేకం, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ నిర్వహించారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఏఈవో హరిహరనాథ్, రాజేందర్‌రెడ్డి, ప్రధాన అర్చకులు జితేందర్ స్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, స్థానాచార్యలు కపీందర్, రాంచందర్, రాము, పాల్గొన్నారు.


