జగిత్యాల: ఈనెల 21న గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. జిల్లాకేంద్రంలో శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించనున్నట్లు తెల్సింది. మరోవైపు రాత్రికిరాత్రే నిజామాబాద్ బదిలీ అయిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజాగౌడ్‌ను మంత్రి పర్యటన నేపథ్యంలో రిలీవ్ చేయలేదని తెల్సింది. ఆయన మరో రెండు రోజులు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం.
‘సర్’ పకడ్బందీగా పూర్తిచేయాలి
జగిత్యాల: సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం సర్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈనెల 17న విడుదలైన డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అన్ని స్థాయిల్లో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 40,683 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు, 1,75,488 అనామలిస్ గుర్తించినట్లు తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై అందే ప్రతి క్లయిమ్ అభ్యంతరాన్ని నిర్ణీత గడువులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బుధవారం కుమ్మరిపల్లిలో తునికి జయ, బొప్పారపు కమల, మాధురికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవీందర్‌రావు, సూర జగన్, సతీశ్‌రావు, పవన్, పోశాలు, రవీందర్‌రెడ్డి, గుమ్మడి భూమయ్య, రాజు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జెండా గద్దెను వెంటనే నిర్మించండి
జగిత్యాల: అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అలాగని బీఆర్‌ఎస్ పార్టీ జెండాగద్దెను తొలగించడం సరికాదని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో బీఆర్‌ఎస్ జెండా గద్దెను అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించారు. ఆ ప్రాంతాన్ని వసంత బుధవారం పరిశీ లించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీకలుగా నిలిచిన బీఆర్‌ఎస్ జెండాకు తగిన గౌరవం కల్పించాలన్నా రు. ఆమె వెంట పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఆనందరావు, గంగారెడ్డి పాల్గొన్నారు.
అటవీ భూమిలో
చెట్ల నరికివేత
కొడిమ్యాల: మండలంలోని సూరంపేట గ్రామ శివారులోని అటవీశాఖ భూమిలో గంగారం తండాకు చెందిన వ్యక్తి 23 గుంటల భూమిలో సుమారు 20 టేకు చెట్లను నరికివేసి భూమిని చదును చేసే క్రమంలో విషయం తెలుసుకున్న ఫారెస్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, నరికిన చెట్లను పరీశీలించి బుధవారం సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. వీరి వెంట బీట్ ఆఫీసర్ ఫిరోజ్ ఖాన్ ,సిబ్బంది ఉన్నారు.
కుమ్మరిపల్లిలో ఇందిరమ్మఇళ్ల
గృహప్రవేశంలో ఎమ్మెల్యే


