అర్హులందరికీ చేయూత పింఛన్లు ప్రతి పేదవారికీ ఇందిరమ్మ ఇళ్లు రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ వెల్లడి జిల్లాకేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు
జిల్లాలో 3,53,166 మందికి స్మార్ట్‌రేషన్ కార్డులు అందిస్తున్నామని, 48,868 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. 87,837 మంది పేర్లను కొత్తగా నమోదు, వృద్ధులు, వితంతువులు తదితర 2,18,002 మందికి ప్రతినెలా రూ.47 కోట్లు పింఛన్ అందిస్తున్నామని తెలిపారు. .
మహాలక్ష్మి పథకం
ఉచిత బస్సు సౌకర్యాన్ని 74.44 లక్షల మంది విని యోగించుకున్నారని, వారికి రూ.305.30 కోట్ల లబ్ధి జరిగిందని, రూ.500కే గ్యాస్ సిలిండర్లను 14,10,844 మందికి అందించి రూ.44.79 కోట్ల సబ్సిడీ అందించామని తెలిపారు. గృహజ్యోతి కింద రూ.208.26 కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట
ఇప్పటివరకు రూ.213.98 కోట్ల వడ్డీ లేని రుణాలు, 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.21.25 కోట్ల వడ్డీ మాఫీ నిధులు అందించామన్నారు. సీ్త్రనిధి ద్వారా రూ.18.20 కోట్లు, స్వశక్తి సంఘాలకు బస్సులు, రూ.5కోట్లతో జిల్లా సమాఖ్య భవనం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫాంలు కుట్టించే బాధ్యత ఇచ్చామని తెలిపారు. ఐదు మున్సిపాలిటీల్లో 18,310 వీధి వ్యాపారులను గుర్తించి రూ.36.70 కోట్ల రుణాలు అందించామన్నారు. ఇందిరమ్మ పథకంతో సొంతింటి కల సాకారం చేస్తున్నామని, 10,860 మందికి ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటికే 2,112 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు.
రైతు సంక్షేమానికి..
జిల్లాలో 444 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.97లక్షల టన్నుల ధాన్యాన్ని 55,141 మంది రైతుల నుంచి కొని వారికి రూ.745.13 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతు భరోసా కింద రైతులకు రూ.166.16 కోట్లు అందించామన్నారు. రైతుబీమా కింద 5,424 మంది రైతు కుటుంబాలకు రూ.271.02 కోట్లు ఇచ్చామన్నారు.
మైనార్టీల సంక్షేమానికి..
మహిళలకు 598 కుట్టుమిషన్లు, 150 మంది యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందిస్తున్నామని, రేవంతన్న సహారా కింద 15 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షలు, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజ న ద్వారా 76మందికి రూ.38 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. 145 మందికి రూ.87లక్షల వందశాతం సబ్సిడీపై పనిముట్లు పంపిణీ చేశామన్నారు.
వైద్య రంగంలో మెరుగైన సేవలు
జిల్లాలో 102 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ఆరు బస్తీ దవాఖానా లు, 17 పీహెచ్‌సీలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 సీహెచ్‌సీలు, మాతాశిశు కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు 3,046 ప్రసవాలు జరగగా.. ఇందులో 2,149 ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అయ్యాయన్నారు. 8 మహిళా క్లినిక్‌లలో 8,447 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించామని, టీ డయాగ్నొస్టిక్స్ ద్వారా 93,564 మంది నుంచి నమూనాలు సేకరించి 3,83,000 పరీక్షలు చేశామని తెలిపారు. ఆర్‌బీఎస్‌కే ద్వారా 79,189 మంది విద్యార్థులను పరీక్షించి 3,895 మందికి చికిత్స అందించామని, 3,933 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు ఇచ్చామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించి 5,767 మందికి చికిత్సలకు రూ.23 కోట్లు ఖర్చు చేశామన్నారు. రహదారులు, భవనాల శాఖ ద్వారా రూ.1,084.83 కోట్లతో 292 పనులు మంజూరయ్యాయన్నారు.ఇప్పటి వరకు 224 పనులు పూర్తి కాగా.. 69 పురోగతిలో ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 1547 మంది పారిశుధ్య కార్మికులు, 385 మంది సర్పంచులకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు అందిస్తున్నామన్నారు. 1,06,814 మంది భవన నిర్మాణ కార్మికులుగా నమోదుకాగా.. వివిధ పథకాల కింద 16,350 మందికి రూ.61.9 కోట్ల ప్రయోజనం కల్పించామని తెలిపారు. భూభారతి కింద నక్షాలు లేని 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే పనులను వేగవంతంగా చేశామని తెలిపారు.
సహకార శాఖ ద్వారా ఎరువులు
జిల్లాలోని 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నాం. యాసంగిలో 302 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.924 కోట్ల విలువైన 39లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొన్నామని, మార్కెటింగ్ శాఖ ద్వారా అదనంగా 52.50 వేల టన్నుల సామర్థ్యంతో 15 ఆధునిక గోదాములు నిర్మించామన్నారు. వందశాతం సబ్సిడీపై 763 చెరువుల్లో కోటి 69లక్షల 52వేల చేప పిల్లలను వదిలామని, చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా, అంగవైకల్యం చెందినవారికి రూ.2.50 లక్షల బీమా ఇస్తున్నామని పేర్కొన్నారు. 302 ఎకరాల్లో ఆయిల్ పాం సాగవుతోంది. ఇందుకు రూ.1.74 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశాం. వనమహోత్సవం కింద 25లక్షల మొక్కలు నాటాం.
అలరించిన నృత్యాలు
ముందుగా వివిధ పాఠశాలల విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాయికల్ తండా ప్రాంతానికి చెందిన వారి గుస్సాడీ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే
చిన్నారులకు పౌష్టికాహారం
జిల్లాలో 1065 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 11,077 మంది గర్భిణులు, 29,897 చిన్నారులు, 13,935 మంది పిల్లలకు పోషకాహారం అందిస్తున్నాం. దివ్యాంగులకు రెట్రో మోటరు వాహనాలు, ల్యాప్‌టాప్‌లు, వీల్‌చైర్స్, స్మార్ట్‌ఫోన్లు, హైబ్రిడ్ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరి, ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ వందశాతం సబ్సిడీపై ఇచ్చాం. రూ.1.25 కోట్లతో వయోవృద్ధుల సదనాన్ని ఏర్పాటు చేశాం. కార్యక్రమంలో కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేశ్, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, బీఎస్.లత, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల: అర్హులందరికీ పింఛన్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.


