జగిత్యాలక్రైం: త్యాగధనులతోనే దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రమని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. 80వ స్వాతంత్య్ర వేడుక సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో జెండావిష్కరించారు. దేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం అందరి బాధ్యత అన్నారు. అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రాములు, రవికుమార్, రిజర్వ్ సీఐలు కిరణ్‌కుమార్, వేణు, సైదులు, సీఐలు ఆరీఫ్ అలీఖాన్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వేడుకలకు భారీ బందోబస్తు
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరేడ్‌గ్రౌండ్‌లోకి వెళ్లే విద్యార్థులు, అధికారులు, ప్రజలను తనిఖీ చేశారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు.
పతకాలకు 10 మంది అధికారులు
పోలీస్‌శాఖలో విశేష సేవలు అందించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదానం చేసే సేవ, ఉత్తమసేవ పతకాలకు జిల్లా నుంచి 10 మంది ఎంపికయ్యారు. వారిని ఎస్పీ అభినందించారు. ప్రజలభద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషిచేసే సిబ్బందికి గుర్తింపు లభిస్తుందన్నారు.
పతకాలు పొందిన అధికారులు వీరే
– అరీఫ్ అలీఖాన్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డీఎస్‌బీ, టి.సూర్య ప్రకాష్, ఏఆర్‌ఎస్‌ఐ, డీఏఆర్, హెడ్‌కాని స్టేబుళ్లు మొహమ్మద్ అబ్దుల్ కలీమ్ (మల్లాపూర్), పి.రాజయ్య (సారంగాపూర్), ఆర్.నర్సింగరావు (వెల్గటూర్), సీహెచ్.శేఖర్ (మెట్‌పల్లి), ఆర్.శేఖర్ (డీసీఆర్‌బీ), ఎ. శ్రీనివాస్ ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ (డీఏఆర్), ఎం.కిరణ్ కుమార్, కానిస్టేబుల్ (బీర్‌పూర్), కె.జలపతి, కానిస్టేబుల్, (వెల్గటూర్).
పతకాలకు ఎంపికై న వారితో ఎస్పీ
జెండా ఆవిష్కరిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్


