సౌదీలో స్వాతంత్య్ర వేడుకలు
కోరుట్ల: సౌదీలోని జెడ్డాలో 80వ స్వాతంత్య్ర వేడుకలను శనివారం
ఘనంగా నిర్వహించారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా జెడ్డా, సౌదీ అరేబియా ఆధ్వర్యంలో కాన్సుల్ జనరల్ ఫహాద్ అహ్మద్ ఖాన్ నూరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు మహమ్మద్ ఫసీఉద్దీన్, అబ్దుల్ రఫీక్, ఫయాజ్, కృష్ణా, సందీప్,
వన్‌రాజ్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
జగిత్యాలఅగ్రికల్చర్: స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. గ్రామీణాభివృద్ధి,
వ్యవసాయం, ఉద్యానవన, మహిళా, శిశుసంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యానశాఖ ఎల్‌నినో పరిస్థితులపై శకటాలు ప్రదర్శించాయి. డాగ్‌స్క్వాడ్ పోలీసుల సాహసాలు, మత్స్యశాఖ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య సందర్శించారు.


