పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

పంచామృతాభిషేకం

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో శుక్రవారం ఆండాళమ్మ వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పంచామృతాలతో అభిషేకం చేశారు.

పోడు భూములకు యూరియా ఇప్పించండి

కథలాపూర్‌(వేములవాడ): తాము ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నామని, వాటికి ఆధార్‌ కార్డుతో యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని కథలాపూర్‌ మండలం రాజారాం తండా గ్రామస్తులు శుక్రవారం విప్‌ ఆది శ్రీనివాస్‌కు విన్నవించారు. అలాగే చింతకుంట గ్రామం నుంచి రాజారాం తండా వరకు గుంతల రోడ్డుతో ఇబ్బందిగా మారిందని, మరమ్మతుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సర్పంచ్‌ భూక్యా తిరుపతినా య క్‌, ఏఎంసీ డైరెక్టర్‌ రమేశ్‌, నాయకులు లకుప తి,గణేశ్‌, రాములు, గజన్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

సేవాభావం పెంపొందించుకోవాలి

జగిత్యాల: విద్యార్థులు దేశసేవపై అంకితభావాన్ని పెంపొందించుకోవాలని 9వ బెటాలియన్‌ ఎన్‌సీసీ హవల్‌దార్‌ ప్రతాప్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం ఎస్‌కేఎన్‌ఆర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో నిర్వహించిన ఎన్‌సీసీ నమోదు కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం ఉండాలన్నారు. ఎన్‌సీసీలో సర్టిఫికెట్‌ సాధించిన కెడెట్స్‌కు ఉన్నత ఉద్యోగ అవకాశాలుంటాయని పేర్కొన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్‌ రాజు, డాక్టర్‌ జీవీఆర్‌ సాయి, మధుకర్‌, గోవర్ధన్‌, శ్రీనివాస్‌, సాయిచరణ్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

మిల్లర్లతో ఎలాంటి ములాఖత్‌ లేదు

జగిత్యాలక్రైం: మిల్లర్లతో ఎలాంటి ములాఖత్‌ లేదని విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సీతారెడ్డి అన్నారు. బుధవారం ‘సాక్షి’లో మిల్ల ర్లతో ములాఖత్‌ శీర్షికన కథనం ప్రచురితం కాగా ఆయన స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లుల్లో తనిఖీలు చేపట్టి ఎంత తక్కువ ధాన్యం ఉందో నిర్ధారించి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు. దీంతో సివిల్‌ సప్‌లై అధికారితో పాటు, అడిషనల్‌ కలెక్టర్‌ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతారన్నారు. కొంత మంది మిల్లర్లు తక్కువ ఉన్నవారు 2–3 రోజుల్లో చెల్లింపులు జరుపుతామని రాత పూర్వకంగా రాసిచ్చిన వారికి ప్రభుత్వమే వెసులుబాటు కల్పించిందన్నారు. కానీ, ఏ మిల్లర్‌పై కక్షసాధింపు లేదని, విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement