● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్/రాయికల్: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం చల్‌గల్ గ్రామానికి చెందిన యువ రైతు పడకంటి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, సర్పంచ్ అదరవేని గంగమల్లయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ హకీం, నాయకులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల బలోపేతానికి కృషి
మహిళ సంఘాల బలోపేతానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ మండలం ఆలూరులో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. రుణ సౌకర్యం ద్వారా మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల నుంచి ఆలూరు, రాయికల్ బస్సు రవాణాకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎంపీడీవో చిరంజీవి, ఎంపీవో సుష్మ, సర్పంచ్ నల్లాల స్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలి
కోరుట్ల: రాష్ట్రంలోని ప్రతీ కల్లు గీతకార్మిక సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ కోరారు. ఈ మేరకు గీతన్నల చైతన్యయాత్ర ఈనెల 2న హైదరాబాద్‌లో ప్రారంభమై శుక్రవారం కోరుట్లకు చేరింది. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంకుబండ్‌పై ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, బహుజన గళం వ్యవస్థాపక అధ్యక్షుడు లింగపెల్లి నరేశ్, నాయకులు సుదవేణి భూమయ్య, ఏపూరి శ్రీనివాస్‌గౌడ్, కిషన్‌గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


