ప్రధాన దారి..ప్రమాదాల ఝరి | - | Sakshi
Sakshi News home page

ప్రధాన దారి..ప్రమాదాల ఝరి

Aug 13 2026 12:09 AM | Updated on Aug 13 2026 12:09 AM

బైపాస్‌పై వెళ్లాలంటేనే వణుకు జిల్లాకేంద్రంలోని రోడ్డు పరిస్థితి సూచిక బోర్డులు కరువు మ్యాన్‌హోల్స్‌ అధికం అదుపుతప్పితే అందులోకే..

ఇది జిల్లాకేంద్రంలోని మహాలక్ష్మీనగర్‌ సమీపంలోని బైపాస్‌రోడ్‌. ఇక్కడ మురికి నీరు పోయేందుకు ఓపెన్‌ చేసి ఉంచారు. పైన ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో డివైడర్‌ను ఢీకొని అందులోనే పడుతున్నారు. ఫలితంగా కాలువలో కొట్టుకుపోతున్నారు.

ఈ రోడ్డు జిల్లాకేంద్రం నుంచి గొల్లపల్లి వైపు వెళ్లే జంక్షన్‌. ఈ ప్రాంతంలో మూలమలుపు పెద్దగా ఉంటుంది. అయితే రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కాలువపై కప్పు మాత్రం వేయలేదు. కనీసం రక్షణ గోడలు, సూచికబోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఒకవేల వాహనదారులు ఏమాత్రం అదుపుతప్పినా.. నేరుగా కాలువలోకి వెళ్లడమే..

జగిత్యాల: 22 ఏళ్ల యువకుడు గంగాధర్‌.. తన తాతకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చూపిద్దామని బైక్‌పై జగిత్యాలకు వచ్చాడు. ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌ మీదుగా బయల్దేరాడు. దేవిశ్రీ గార్డెన్స్‌ సమీపంలోకి రాగానే.. రోడ్డు మలుపుగా ఉండడం.. అక్కడ ఎలాంటి సూచికబోర్డులు లేకపోవడంతో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని చెట్టుకు గుద్దుకుని స్పాట్‌లోనే మృతిచెందాడు. తాత పోశయ్య చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందాడు. ఇలా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. గతంలో ఇక్కడ అతిపెద్ద నాలా ఉండటంతో దానిపైనే కప్పు వేసి ఈ బైపాస్‌రోడ్‌ నిర్మించారు. అక్కడక్కడ ప్రమాదకర మ్యాన్‌హోల్స్‌ ఉన్నాయి. వీటిపై కప్పులు లేకపోవడంతో బైక్‌లు, ఇతర వాహనాలు డివైడర్లను ఢీకొని నేరుగా మురికి కా లువల్లోనే పడిన సంఘటనలు అనేకం. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. జగిత్యాల డివిజన్‌ కేంద్రంగా ఉన్నప్పుడు వేసిన ఈ బైపాస్‌రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. రద్దీ పెరగడం.. బైపాస్‌రోడ్డే సెంటర్‌పాయింట్‌ మారడం.. అనేక వాణిజ్య వ్యాపారాలు పెరగడంతో రోడ్డు ఇరుకుగా మారి నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

టెండర్‌ ప్రాసెస్‌లో ఉంది

బైపాస్‌రోడ్‌ మరమ్మతుకు రూ.2.79 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచాం. కొన్ని కారణా లతో రద్దు కాగా.. రీటెండర్‌ పిలిచాం. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకంటాం. రోడ్డు ఇబ్బందులు ఉన్నది వాస్తవమే. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.

– అరుణ్‌, ఇన్‌చార్జి డీఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement