మెట్‌పల్లి: క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు దోహాదం చేస్తాయని మెట్‌పల్లి కోర్టు సీనియర్ సివిల్ మేజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు అన్నారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడాపోటీలను బుధవారం జూని యర్ సివిల్ మేజిస్ట్రేట్ మాధవితో కలిసి ప్రా రంభించారు. ప్రతిఒక్కరూ రోజువారీ జీవితంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, ఏపీపీలు ఆనంద్‌గౌడ్, ప్రణయ్, ఏజీపీ హఫీజ్ తదితరులున్నారు.
ఎస్సారెస్పీకి 2580 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. బుధవారం సా యంత్రం ఆరు గంటల వరకు 2580 క్యూసెక్కుల స్వల్ప ఇన్ ఫ్లో వస్తుంది. నీటిమట్టం 10 91 అడుగులకు 1079.40, నిల్వ సామర్థ్యం 80. 5 టీఎంసీలకు 43.371 టీఎంసీలకు చేరింది.
పర్మిట్ లేకుంటే వాహనాలు సీజ్
జగిత్యాలక్రైం: పర్మిట్, అనుమతి లేని వాహనాలు రోడ్కెక్కితే సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారి మహ్మద్ సందాని అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 21 వాహనాలపై కేసు నమోదు చేశారు. ప్రతి వాహనానికి ఫిట్‌నెస్ ఉండాలని, ఇన్సూరెన్స్, పర్మిట్ పత్రాలు, డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఓవర్‌లోడ్ వాహనాలపై చర్యలు చేపడుతున్నామన్నారు. తనిఖీల్లో ఎంవీఐ రామారావు, ఏఎంవీఐ సాయిచరణ్ పాల్గొన్నారు.
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నిర్మించి రైతులకు సాగునీరు అందించారని, ప్రభుత్వం కన్నెపల్లి పంప్‌లు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలని, మిడ్‌మానేరును నింపాలని డిమాండ్ చేశారు. సర్ మ్యాపింగ్ జగిత్యాలలో 87.60శాతం, కోరుట్లలో 89.26, ధర్మపురిలో 91.97శాతం పూర్తయిందన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేయాలని, ప్రజా స మస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, తుమ్మ గంగాధర్, ఆనందరావు, ప్రవీణ్, గంగారెడ్డి, రాజేందర్, అనురాధ, లక్ష్మణ్ పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
జగిత్యాల: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌వో సుజాత తెలిపారు. బుధవారం పీసీపీఎన్‌డీటీ అడ్వైజయిరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. నిర్వాహకులు ప్రతినెలా ఫారం ఎఫ్‌ను ఆన్‌లైన్ పోర్టల్‌లో పొందుపర్చాలని, 5వ తేదీలోపు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమర్పించాలని సూచించారు. మాతాశిశు సంక్షేమాధికారి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 84 స్కానింగ్ సెంటర్లు అనుమతి పొందాయన్నారు. గైనకాలజిస్ట్ అరుణ, విశ్వభారతి, దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.


