గొల్లపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామాలకు శాశ్వతంగా ఉపయోగపడే ఆస్తులను సృష్టించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కీలకమార్పులు తీసుకొచ్చింది. మొన్నటివరకు మహాత్మాగాంధీ ఉపాధి హామీగా ఉన్న ఈ పథకాన్ని తాజాగా వీబీ జీ రాంజీ పథకంగా మార్చిన కేంద్రం.. పనుల స్వరూపం, నిధుల విధానం, పనిదినాల పెంపు వంటి అంశాల్లో సంస్కరణలు చేపట్టింది. ఇకపై ప్రజలకు కనిపించే, రైతులకు ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇవ్వనుంది.
ఉమ్మడి నిధులతో అమలు
గతంలో ఉపాధి హామీ పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలయ్యేది. కొత్త విధానంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పథకాన్ని అమలు చేయనున్నాయి. కేంద్రం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులు భరించనున్నాయి. రెండు ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కొనసాగనున్నాయి.
తాత్కాలిక పనులకు చెక్..
గతంలో చెట్ల తొలగింపు, మట్టి పనులు వంటి తాత్కాలిక పనులు ఎక్కువగా జరిగేవి. వాటి వల్ల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం ఉండడం లేదని భావించిన కేంద్రం.. పథకంలో మార్పులు చేసింది. ఇకపై రైతులు, గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే 318 రకాల పనులను నాలుగు కేటగిరీల్లో గుర్తించి అమలు చేయనుంది. కాలువలు, నీటి కుంటలు, చెక్‌డ్యాంలు, సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులకు ఈ పథకంలో అవకాశం కల్పించారు.
వంద నుంచి 125 రోజుల ఉపాధి..
‘జలసిరి’తో నీటి నిల్వలకు ఊతం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలసిరి పథకం పనులను వీబీజీఆర్ పథకం కింద చేపట్టనున్నారు. నీటి కుంటలు, చెక్‌డ్యాంలు, వర్షపు నీటిని నిల్వ చేసే నిర్మాణాలు, రైతులకు ఉపయోగపడే నీటి వనరుల అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ పనులన్నింటినీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు.
వీబీజీఆర్ పథకం ప్రత్యేకతలు..
125 రోజుల ఉపాధి హామీ, 318 రకాల అభివద్ధి పనులు, నాలుగు కేటగిరీల్లో అమలు, శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రాధాన్యం, రైతులకు ఉపయోగపడే నీటి వనరుల అభివృద్ధి, సీసీ రోడ్లు, కాలువలు, చెక్‌డ్యాంల నిర్మాణం.
‘వీబీజీఆర్’తో మారనున్న పల్లెల రూపురేఖలు
ఇక నుంచి శాశ్వత పనులే
వ్యవసాయ పనులకు ప్రాధాన్యం
గ్రామాభివృద్ధికి ఉపయోగం
వీబీజీఆర్ పథకం ద్వారా కూలీలకు 125 రోజుల ఉపాధి కల్పించడం, రైతులకు శాశ్వతంగా ఉపయోగపడే పనులు సృష్టించడమే ప్రధాన లక్ష్యం. కాలువలు, నీటి కుంటలు, చెక్‌డ్యాంలు, సీసీ రోడ్లు వంటి పనులకు అవకాశం కల్పించాం. గ్రామీణాభివృద్ధికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది.
– రవీందర్‌రావు, ఎంపీడీవో, గొల్లపల్లి


