పరిశీలనకే పరిమితమా..! | - | Sakshi
Sakshi News home page

పరిశీలనకే పరిమితమా..!

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ విద్య అందించేందుకు కేంద్రప్రభుత్వం 2022లో తీసుకొ చ్చిన ప్రధానమంత్రి స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) మూడో విడత కోసం జిల్లాలోని పలు పాఠశాలలు ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో రెండువిడతల్లో కలిపి ఇప్పటి వరకు 23 స్కూళ్లను ఎంపిక చేసి.. అందులో సౌకర్యాలు కల్పించారు. ఏటా స్కూళ్లకు నిధులు వస్తుండడంతో ఆయా పాఠశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మెరుగైన విద్య అందుతుండడం.. వసతులు ఉండటంతో విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో నైపుణ్యం సాధిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో వృత్తి విద్య కోర్సులు, కంప్యూటర్‌ ల్యాబ్స్‌, తదితర వసతులన్నీ అందుబాటులోకొచ్చాయి.

మూడో విడత కోసం ఎదురుచూపులు

మూడో దశలో ఎంపికకు 2024లో యూడైస్‌, ప్లస్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారంగా పాఠశాలల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పరిశీలించి.. స్కూళ్లలో ప్రస్తుతం అందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌, ఉపాధ్యాయు ల బృందం పనితీరును తెలుసుకుని ఆన్‌లైన్‌లోనే పరిశీలించి అనంతరం ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఒకట్రెండు దశల్లో పీఎంశ్రీకి ఎంపిక చేసిన స్కూళ్ల గడువు 2026–27లో ముగుస్తుంది.

ఇప్పటివరకు ఎంపికై న స్కూళ్లు..

ఇబ్రహీంపట్నం, రాయికల్‌, బీర్‌పూర్‌ ఎంపీపీఎస్‌, జెడ్పీహెచ్‌ఎస్‌, కోనాపూర్‌, మగ్గిడి, కొండపల్లి, జగిత్యాల హైస్కూల్‌, ధరూర్‌క్యాంప్‌, వెంకట్రావ్‌పేట, టీజీఎంఎస్‌ కల్లూరు, కోరుట్ల, మోడల్‌ స్కూ ల్‌ పెద్దాపూర్‌, ఎంపీపీఎస్‌, డీడీనగర్‌, పోతారం, రాంసాగర్‌, టీజీఎంఎస్‌ నూకపల్లి, పెగడపల్లి, గొల్లపల్లి, టీజీఎంఎస్‌ కుమ్మరిపల్లి, టీజీడబ్ల్యూఈఆర్‌ఎస్‌ మ్యాడారం, టీజీడబ్ల్యూఈఆర్‌ఎస్‌ మల్లాపూర్‌, ఎంపీపీఎస్‌ జీడీనగర్‌ ఎంపికయ్యాయి.

పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో రూపురేఖలు మారిపోయాయి. అందులో మెరుగైన విద్య, విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించా రు. తద్వారా విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. 2026–27తో పథకం ముగియనుంది. వాటి స్థానంలో కొత్తగా మరిన్ని పాఠశాలలను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ ఇప్పటివరకు పురోగతి లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పీఎంశ్రీ కోసం పాఠశాలల ఎదురుచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement