పథకాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Aug 8 2026 1:23 AM | Updated on Aug 8 2026 1:23 AM

కోరుట్ల/మెట్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వయం సహాయక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజనలో మంజూరైన చెక్కులను శుక్రవారం పట్టణంలోని మున్సిపల్‌ ఆవరణలో గల మెప్మా భవనంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరుమల వసంతతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కమిషనర్‌ రాఘవేంద్ర, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే మెట్‌పల్లి పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన చెక్కులు అందించారు. అంతకు ముందు బోనాల వేడుకలను పురస్కరించుకొని మహాలక్ష్మీ ఆలయంలో పూజలు చేశారు. వన మహోత్సవంలో భాగంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రి, డీఎస్పీ రాములు, సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు రైసుద్దీన్‌ పాల్గొన్నారు.

అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ

కరీంనగర్‌స్పోర్ట్స్‌: హన్మకొండలోని జేఎన్‌ స్టేడియంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర 12వ యూత్‌ అండర్‌ 18 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. 12 సంవత్సరాల కేటగిరీలో 60 మీటర్ల పరుగు విభాగంలో 48 మంది క్రీడాకారులు పాల్గొనగా, నూరైన్‌ ప్రతి భ కనబరిచి స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం బాధ్యులు నూరైన్‌ను అభినందించి భవిష్యత్‌లో మరి న్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement