జగిత్యాల: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ శాఖకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని, వేదిక, పతాకావిష్కరణ, పరేడ్, ముఖ్య అతిథి సందేశం అన్ని ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేలా చూడాలన్నారు.
హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతి
జగిత్యాలక్రైం: జిల్లాలో పనిచేస్తున్న నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా, ఓ కానిస్టేబుల్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా శుక్రవారం పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వావిలాల గంగాధర్, ట్రాఫిక్‌లో పనిచేస్తున్న గణేశ్, కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కనకయ్య, ఎస్బీలో పనిచేస్తున్న శంకర్‌కు హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి.కిరణ్‌కుమార్ హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన వారిని ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు.
ఎస్సారెస్పీలో 39.707 టీఎంసీలు
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 39.707 టీఎంసీలకు చేరుకుంది. ఎస్సారెస్పీ నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8,334 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండగా, 973 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తల్లిపాలే శిశువుకు వరం
జగిత్యాల: తల్లిపాలే శిశువుకు వరమని మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 42వ వార్డులో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు. పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించాలన్నారు. తల్లి, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఐసీడీఎస్ సీడీపీవో జయప్రద, మెడికల్ ఆఫీసర్ కృష్ణకుమారి, రాజశ్రీ, మమత, వాణి, జయశ్రీ, పద్మ పాల్గొన్నారు.
చెత్తను విభజించి ఇవ్వాలి
ప్రతి ఇంటి నుంచి చెత్తను నాలుగు రకాలుగా విభజించి ఇవ్వాలని మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. శుక్రవారం మహిళ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కౌన్సి లర్లు, మహిళసంఘాల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో అతితేలిక పాటి నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. ఈనెల 8న జిల్లాలో అక్కడక్కడ బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, 9న గంటకు 14–18 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 31–32, రాత్రి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయని, గాలిలో తేమ ఉదయం 85–8 శాతం, మధ్యాహ్నం 54–4 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.


