వరదకాలువలో ఎల్లంపల్లి నీళ్లే | - | Sakshi
Sakshi News home page

వరదకాలువలో ఎల్లంపల్లి నీళ్లే

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

● విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌(వేములవాడ): ప్రస్తుతం వరదకాలువలో ప్రవహిస్తున్నవి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లే అని, కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు కాదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం కథలాపూర్‌ మండలం దుంపేట శివారులో ఎస్సారెస్పీ వరదకాలువ నీటిలో పూజలు చేశారు. అనంతరం ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన కింద మంజూరైన రూ.50 వేల చెక్కులను ఇద్దరికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ, వరదకాలువలో నీళ్లు వస్తుండటంపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో ఎన్‌డీఎస్‌ఏ సూచనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి కాయితి నాగరాజు, పీసీసీ సభ్యుడు తొట్ల అంజయ్య, చెదలు సత్యనారాయణ, సర్పంచులు శేఖర్‌, రవి, రాజగంగారాం, నాయకులు ఎండీ హఫీజ్‌, అజీమ్‌, హరిప్రసాద్‌, రాజారెడ్డి, స్వామిరెడ్డి, అశోక్‌, నరేశ్‌, బాలు పాల్గొన్నారు.

చెక్కులు పంపిణీ

మేడిపల్లి: చిన్నారుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం మేడిపల్లి, భీమారం మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. భీమారం మండలం రంగపూర్‌ వరద కాల్వ వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement