ఇబ్రహీంపట్నం: కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాధం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 14 వరకు జరుగనున్న ప్రచారయాత్రలో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలకేంద్రం కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ప్రచారయాత్ర నిర్వహించారు. కేంద్రం విధానాలతో పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలకు భారంగా మారిందన్నారు. పెరిగిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నాయకులు సుతారి రాములు, ఎండీ ఉస్మాన్, రాజన్న, వంశీ, రమేశ్, ఎన్నం రాధ, శాంతమ్మ, ఫిర్దోస్ పాల్గొన్నారు.


