విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్‌ మానక్‌ పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం, సృజనాత్మకత, పర్యావరణ బాధ్యతలను పెంపొందించడంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థుల వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు వెలికితీసి ప్రోత్సహించాలన్నారు. ప్రేరణ మానక్‌లో ఆరో తరగతినుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను గుర్తించి ఆగస్టు 30లోగా వందశాతం నామినేషన్లు పూర్తి చేయాలన్నారు. డీఈవో రాము, సైన్స్‌ అధికారి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ఈవీఎంల వద్ద భద్రత ఉండాలి

ఈవీఎం గోదాంల వద్ద భద్రత ఉండాలని కలెక్టర్‌ అన్నారు. ధరూర్‌ క్యాంప్‌లోని ఈవీఎం గోదాంలను పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ లత, ఆర్డీవో పాల్గొన్నారు.

గడువులోపు పనులు పూర్తి చేయాలి

మల్లాపూర్‌: పంచాయతీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అన్నారు. మల్లాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఓపీ, ఐపీ సేవలు, ల్యాబ్‌, మెడికల్‌ ఫార్మసీ, ఐపీ రికార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. పాతదాంరాజుపల్లిలో పంచాయతీ భవనాన్ని నాణ్యతతో పూర్తిచేయాలని ఆదేశించారు. వాల్గొండలో రూ.3కోట్లతో చేపట్టబోయే పుష్కరఘాట్లు, రహదారి పనులను పరిశీలించారు. వాల్గొండ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వరకు బైపాస్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మెట్‌పల్లి ఆర్డీవో నరసింహరావు, డీఎంహెచ్‌వో సుజాత, పీఆర్‌ ఈఈ లక్ష్మణ్‌రావు, డీఈ అన్వర్‌, తహసీల్దార్‌ రాంచందర్‌, ఎంపీడీవో శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement