ఎన్నాళ్లిలా.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లిలా..

Aug 1 2026 12:16 AM | Updated on Aug 1 2026 12:16 AM

జగిత్యాల: జిల్లా కేంద్రంలో చాల్లా ఏళ్ల క్రితం 4–5 ప్రధాన నాలాలు నిర్మించగా శిథిలావస్థకు చేరాయి. పాలకులు మారుతున్నా వాటి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. ముఖ్యంగా పట్టణంలోని గంజ్‌నాలా సుమారు 2 కి.మీ ఇళ్లను ఆనుకునే ఉంటుంది. దీని రక్షణ గోడలు కూలిపోయి శిథిలావస్థకు చేరడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు అందులో పడే ప్రమాదముంది. వర్షాలు బాగా కురిస్తే పలుచోట్ల నాలా నీళ్లు ఇళ్లలోకి చేరుతోంది. అలాగే పొన్నాల గార్డెన్స్‌ నుంచి చింతకుంట చెరువు వరకు ఉన్న నాలా పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయింది. చింతకుంట మత్తడి నుంచి సలీమా గార్డెన్స్‌ వరకు ఉన్న నాలా సక్రమంగా లేక రెండురోజులు కురిసిన వర్షానికి స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జేసీబీలతో చెత్తాచెదారం తొలగించడంతో నీళ్లు సాఫీగా వెళ్లాయి. మరో నాలా నర్సింగ్‌ కళాశాల నుంచి గోవిందుపల్లికి వెళ్లే రోడ్డు వరకు ఉంటుంది. ఇది మోతె వాగులో కలుస్తోంది. ఈ నాలా చాలా వరకు కబ్జాకు గురవడంతో సమీపంలోని ఇళ్లలోకి వరద చేరుతోంది.

కబ్జామయం

జిల్లాకేంద్రంలోని ప్రధాన నాలాలు, డ్రెయినేజీలు, శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జగిత్యాల డివిజన్‌ కేంద్రంగా ఉన్నప్పుడు ధరూర్‌ వాగును కబ్జా చేసి ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టగా అప్పటి సబ్‌కలెక్టర్‌ శశాంక అక్రమ కట్టడాలను కూల్చివేసి వాగును పునఃనిర్మించారు. ప్రస్తుతం మళ్లీ కొద్దిపాటి కబ్జాలకు గురికావడంతో వాగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. అలాగే భవానినగర్‌, కృష్ణానగర్‌, విద్యానగర్‌లో నాలాలపై షాపులు, నివాసాలు కట్టడంతో 12 ఫీట్ల కాలువలు 2–3 ఫీట్లుగా మారాయి. టవర్‌సర్కిల్‌ ప్రాంతంలో డ్రెయినేజీలపై నిర్మాణాలు చేపట్టడంతో ఇళ్లలోకి మురికినీరు వస్తుందని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు.

రక్షణ గోడలు నిర్మించాలి

పట్టణంలోని నాలాలను విస్తరించి, రక్షణ గోడలు నిర్మిస్తే ముంపు ముప్పు ఉండదు. కాలువల్లో షిల్ట్‌, పిచ్చిమొక్కలు తొలగించడానికి అధికారులు నిధులు కేటాయిస్తున్నారు కానీ రక్షణ గోడలకు కేటా యి ంచడం లేదు. ఇప్పటికై నా నాలాలను విస్తరించి గో డలు నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

విస్తరణకు నోచుకోని నాలాలు

రక్షణ గోడలు లేక పొంచి ఉన్న ముప్పు

పట్టింపులేని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement