రాయికల్: ఎస్‌ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. శుక్రవారం రాయికల్‌తో పాటు మండలంలోని వీరాపూర్‌లో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తప్పులు దొర్లకుండా నమోదు చేయాలని సూ చించారు. అనంతరం వీరాపూర్‌లో భూముల రీసర్వేపై గ్రామస్తులకు అవగాహన కల్పించా రు. తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ డిండిగాల గంగు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
రాయికల్: గురుకుల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం అల్లీపూర్‌లోని జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల ఆవరణ, స్టాక్ రిజిష్టర్లు, మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డిప్యూటీ సీఈవో నరేశ్, ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ గౌతమి పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
కథలాపూర్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు ఎస్పీ చేతన్ ని తిన్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో రాత్రిపూట పె ట్రోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని, నేరాల నియంత్రణపై దృష్టిసారించాలని సూచి ంచారు. సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై రవికిరణ్ పాల్గొన్నారు.
నిధుల గోల్‌మాల్ కేసుపై దర్యాప్తు
జగిత్యాలక్రైం: జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నిధులు దుర్వినియోగం చేశారని ఆస్పత్రిలో పనిచేస్తున్న షేక్ యాసిన్‌తో పాటు, మరికొంత మందిపై గతేడాది మే 26న అప్పటి ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు షేక్ యాసిన్‌ను అరెస్ట్ చేశారు. సుమారు 4.96 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోలీసు అధికారులు బదిలీ కావడంతో ప్రస్తుతం ఈ కేసును పోలీసులు మళ్లీ దర్యాఫ్తు ముమ్మరం చేశారు. బ్యాంకర్ల పాత్ర, ఉద్యోగుల పాత్రపై లోతైన విచారణ చేస్తున్నట్లు పోలీసులు ముమ్మర దర్యాఫ్తు కొనసాగిస్తున్నారు.


