జగిత్యాల: ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం జగిత్యాలలో వెల్‌నెస్ సెంటర్ మంజూరు చేయాలని ఆరోగ్య శాఖమంత్రి రాజనర్సింహకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
హైలెవల్ బ్రిడ్జి ..
రాయికల్: రాయికల్ మండలం బోర్నపల్లి–జగన్నాథపూర్ మధ్య హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. గిరిజన గ్రామం జగన్నాథ్‌పూర్ నుంచి రాయికల్‌కు రావాలంటే సుమారు 15కి.మీ రావా ల్సి ఉంటుందని, ఈ గ్రామాల మధ్య వాగుపై హైలెవల్ వంతెన నిర్మిస్తే గిరిజనులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ విషయంపై కేంద్ర గిరి జన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.


