విష జ్వరాల పంజా | - | Sakshi
Sakshi News home page

విష జ్వరాల పంజా

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

● జిల్లాలో పెరుగుతున్న కేసులు ● ఇద్దరు చిన్నారుల మృతి ●

జిల్లాలో ఇప్పటికే విష జ్వరాల

బారిన పడి జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఇలా నిత్యం ఆస్పత్రుల్లో అనేక కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వైద్య బృందం

క్యాంపులు కొనసాగిస్తున్నారు.

జగిత్యాల: ఎల్‌నినో ప్రభావం.. వాతావరణంలో మా ర్పులు రావడంతో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. జిల్లాలో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, తలనొ ప్పితో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి సారించినప్పటికీ ఆస్పత్రికి మాత్రం రోగుల తాకిడి పెరిగిపోతోంది. నిత్యం వందల సంఖ్యలో ఓపీ పెరిగిపోతో ంది. ఈసంవత్సరం డెంగీ 3 కేసులు నమోదయ్యా యి. మలేరియా కేసులు అత్యఽధికంగా ఉన్నాయి. జి ల్లాలోని ఐదు మున్సిపాలిటీలతో పాటు మండలా లు,గ్రామాల్లో సైతం విష జ్వరాలు సోకుతున్నాయి.

ప్రత్యేక చర్యలు

జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. మున్సిపల్‌ పరిధిలో కొన్ని వార్డులను సందర్శించి పారిశుధ్య నిర్వహణపై సూ చనలు చేశారు. డ్రెయినేజీల్లో పూడిక తీయకపోవడ ం, ప్రతీచోట నీరు నిలిచి ఉండటంతో పారి శుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇళ్లలో టైర్లు, కూలర్లు, పూలకుండీలు, కొబ్బరిచిప్పలు, ఖాళీ సీసాలు, నీరు నిలువ ఉండే పాత్రలను గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోకపోతే వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి.

ప్రతీరోజు డ్రై డే పాటిస్తేనే..

ప్రస్తుత సీజన్‌లో ప్రతీరోజు డ్రై డే పాటిస్తేనే వ్యాధులు తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో పారిశుధ్య అస్థవ్యస్థంగా మారడంతో డెంగీ, చికెన్‌ గున్యా, మలేరి యా వంటి వ్యాధులు ప్రబలే ప్రబలిస్తున్నాయి. దో మల నిర్మూలనకు ప్రతిఒక్కరూ చర్యలు తీసుకోవడంతో పాటు, పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాల్సి అవసరం ఉంది. ప్రతీ మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు, వర్షపు నీటితో నిండిపోవడంతో దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటలైందంటే ఇళ్లలోకి విపరీతంగా దోమలు వస్తున్నా యి. వీటిని అరికట్టకపోతే వ్యాధుల బారిన పడాల్సిందే. ముఖ్యంగా ఫాగింగ్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మచ్చుకు సైతం ఏ మున్సిపాలిటి, గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపించడం లేదు.

శానిటేషన్‌ అస్తవ్యస్తం

మున్సిపాలిటీల్లో శానిటేషన్‌ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపైనే చెత్తాచెదారం వేయడం, అవి 3–4 రోజుల వరకు తీయకపోవడంతో దుర్గందం వెదజల్లుతోంది. దీంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒక వైపు కలెక్టర్‌ ఆదేశిస్తున్నా కొన్ని మున్సిపాలిటీల్లో ఆశించిన మేరకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదు. మున్సిపల్‌ అధికారులు నిత్యం వార్డుల్లో ఫాగింగ్‌ చేయడంతో పాటు, ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప వ్యాధులు అరికట్టే అవకాశం ఉండదు.

2026 జనవరి నుంచి ఇప్పటివరకు

ఫీవర్‌ కేసులు : 6,389

డెంగీ : 3

చర్యలు తీసుకుంటాం

ఎల్‌నినో ప్రభావంతో వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిత్యం డ్రై డే పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించాం. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. సీజనల్‌ వ్యాధులను దూరం చేద్దామనే సందేశంతో ముందుకెళ్తున్నాం. ఆస్పత్రుల్లో సైతం పరీక్ష కిట్లు, సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – సత్యప్రసాద్‌, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement