కోరుట్ల రూరల్: ప్రతీఒక్కరు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం మండలంలోని సంగెం గ్రామంలో సంఘ మహేశ్వర ఆలయ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం గ్రామంలో నిర్మించిన గ్రామైఖ్య మహిళా సంఘ భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, సర్పంచ్ చీటి స్వరూప, కార్యదర్శి శేఖర్, ఉప ససర్పంచ్ సుదవేణి మహేశ్, నాయకులు చీటి వెంకట్రావు, రాంచందర్ రావు, తీగల మహేశ్, శంకర్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.
భూ తగాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
భూ తగాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దటమే ప్ర భుత్వ లక్ష్యమని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని సంగెంలో శుక్రవారం భూ రీసర్వేలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ గ్రామం నుంచి 50–60 భూ తగాదా దరఖాస్తులు ఉన్నాయని, వాటిని పరిష్కరించటమే భూ రీసర్వే కార్యక్రమం అని కలెక్టర్ వివరించారు. అంతకు ముందు రైతుల నుంచి సందేహాలు, సలహాలు స్వీకరించారు. సర్పంచ్ చీటి స్వరూప, ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చై తన్య, ఆర్‌ఐ శ్రీనివాస్ యాదవ్, ఉపసర్పంచ్ మహేశ్, కార్యదర్శి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.


