కొండగట్టు ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలి
జగిత్యాల: కొండగట్టు ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శుక్రవారం శాసనమండలి సమావేశంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో రూ.100 కోట్లతో జీవో కూడా ఇచ్చినట్లు గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వపరంగా 600 ఎకరాల భూమిని కూడా కొండగట్టు ఆలయ పరిధిలోకి తీసుకువచ్చి కలెక్టర్ ద్వారా ప్రొసిడింగ్ సైతం ఇవ్వడం జరిగిందన్నారు. రోడ్లు, పార్కింగ్, తాగునీరు, మూత్రశాలలు, క్యూలైన్, భద్రత వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.


