వివాదంలో చారిత్రక స్థలం
కోరుట్ల: క్రీ.శ.11వ శతాబ్దంలో జైన చాళుక్యుల కా లం నాటి కోట బురుజులు, కోనేరు పరిసర ప్రాంతాల స్థలం కోరుట్లలో చర్చనీయంగా మారింది. వందల ఏళ్లుగా పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న స్థలంపై కోట బురుజులు, కోనేరు మినహా మిగిలిన స్థలం పట్టాదారులకు చెందుతుందని ఇటీవల హె రిటేజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట బురుజు, కోనేరును ఇక్క డ వైభవంగా విలసిల్లిన చారిత్రక, సంస్కృతి సంపదగా భావించిన స్థానికులు ఒక్కసారిగా ఈ స్థలంలో ముప్పాతిక వంతు పట్టాదారులకు చెందుతుందని ఉత్తర్వులు రావడంతో అయోమయంలో పడ్డా రు. ఈక్రమంలో కోరుట్ల భూ పరిరక్షణ ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ స్థలం రెవెన్యూ రికార్డుల్లో అబాదీగా ఉందని ప్రజావసరాలకు వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర్వులతో కదలిక
కోరుట్ల కోట బురుజులు, కోనేరుతో పాటు సుమారు 3.21 ఎకరాల స్థలం ఎనిమిది నెలల క్రితం వరకు పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని ఆంక్షలు అమలులో ఉండేవి. ఈ కారణంగా కోట బురుజుల సమీపంలో ఉన్న అనేక మంది మున్సిపల్ నుంచి ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్లు రాక అవస్థలు పడ్డారు. కోట బురుజులకు సుమారు 200 మీటర్ల పరిధిలో స్థలాలు ఉన్న పట్టాదారులు గత్యంతరం లేక మున్సిపల్ అనుమతులు లేకుండానే ఇళ్లు కట్టుకున్నారు. ఈక్రమంలో కోట బురుజులు, కోనేరు మినహా మిగిలిన స్థలంలో తమకు హక్కులున్నాయని పట్టాదారులు రెవెన్యూ, పురాతత్వ శాఖను ఆశ్రయించారు. ఈ సమస్య చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండగా గతేడాది జూలై 3వ తేదీన హెరిటేజ్ శాఖ ఈ స్థలంలో ఉన్న కోట బురుజులు, కోనేరులు నిర్మించి ఉన్న స్థలం విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని 5,549 చదరపు ఫీట్ల స్థలం ప్రభుత్వానికి చెందుతుందని నిర్ధారించారు. మిగిలిన 8,984 ఫీట్ల స్థలం పట్టాదారులకు చెందుతుందని ఉత్తర్వుల్లో తెలిపా రు. ఈ ఉత్తర్వులతో ఏళ్ల తరబడి తమ పట్టా స్థలం కోసం ప్రయత్నిస్తున్న పట్టాదారులకు, ఈ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్ అనుమతులు లేక అవస్థలు పడ్డ వారికి ఊరట దక్కింది.
ఎక్కడిక్కడే చిక్కులు
హెరిటేజ్ శాఖ ఉత్తర్వులతో పట్టాదారులు తమ స్థలం స్వాధీనం చేసుకుని అమ్మకాలకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఎక్కడిక్కడే చిక్కులు ఎదురుకావడంతో మరోసారి కోట బురుజుల పరిసరాల స్థలం చర్చనీయంగా మారింది. ఈ స్థలంలో ఉన్న పట్టాదారుల మధ్య హద్దుల వివాదం నెలకొనడంతో మూడు రోజుల క్రితం కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయం సమీపంలో గొడవ జరిగినట్లు సమాచా రం. ఫలితంగా ఈ స్థలంలో భూ క్రయ విక్రయ రిజి స్ట్రేషన్లు తాత్కాలికంగా ఆపేసినట్లు కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ అశోక్ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ స్థలానికి మున్సిపల్ అఽధికారులు వీఎల్‌టీ న ంబర్ కేటాయించిన తీరు మరో వివాదానికి దారి తీసింది. దీనికి తోడు కోరుట్ల భూ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఈ స్థలం ఆబాదీగా నమోదైందని దీనికి వ్యక్తిగత యజమానులు లేరని, ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరాదని సబ్ రిజిస్ట్రార్ అశోక్‌కు శుక్రవారం మరోసారి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద రూ.కోట్ల విలువ చేసే కోరుట్ల కోట బురుజుల స్థలం అంశం ప్రస్తుతం చర్చనీయంగా మారింది.
వివాదంలో చారిత్రక స్థలం


