బియ్యం తీసుకోండయ్యా! | - | Sakshi
Sakshi News home page

బియ్యం తీసుకోండయ్యా!

Jan 3 2026 7:20 AM | Updated on Jan 3 2026 7:20 AM

బియ్యం తీసుకోండయ్యా!

బియ్యం తీసుకోండయ్యా!

సీఎంఆర్‌ అప్పగింతకు మిల్లర్లు రెడీ.. సేకరణలో జాప్యం చేస్తున్న అధికారులు మూతపడుతున్న మిల్లులు వెళ్లిపోతున్న హమాలీలు, ప్లాంట్‌ ఆపరేటర్లు

జగిత్యాలరూరల్‌: జిల్లాలోని రైస్‌మిల్లర్లు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ధాన్యం సేకరణతో పాటు, మరో వైపు ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సి ఉండగా, ప్రభుత్వం బియ్యం సేకరణలో జా ప్యం చేస్తుండటంతో మిల్లర్లు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో రబీ 2024–25 సంవత్సరానికి గాను ఇచ్చిన ధాన్యానికి మిల్లర్లు 4.70 లక్షల మె ట్రిక్‌ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీంతో బియ్యం సేకరణ 2026 ఫిబ్రవరి 28లోపు అప్పగించాల్సిందిగా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కానీ బి య్యం ఇచ్చేందుకు మిల్లర్లు సుముఖంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు బియ్యం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు.

మూతపడనున్న

90 పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లులు

జిల్లాలోని 90 మంది పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి 2024–25 రబీ ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఇప్పటికే 2.35 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అప్పగించారు. మిగతా 2.35 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పారాబాయిల్డ్‌ బియ్యాన్ని తీసుకునేందుకు నిరాకరిస్తోంది. రా రైస్‌ బియ్యాన్నే సేకరించాలని అధికారులకు ఆదేశాలు ఉండటంతో అధికారులు పారాబాయిల్డ్‌ రైస్‌ తీసుకోవడం లేదు. దీంతో పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లర్లు రా రైస్‌ బియ్యం చేస్తే 50 శాతం నూక రావడంతో వారు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. తాము బాయిల్డ్‌ రైస్‌ అప్పగిస్తామని మిల్లర్లు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం రా రైస్‌ సేకరణకే సుముఖంగా ఉంది. దీంతో జిల్లాలోని పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లులు మూతపడే అవకాశాలున్నాయి.

భారంగా మారిన నిర్వహణ

జిల్లాలోని 24 రా రైస్‌మిల్లులు, 90 పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లుల నిర్వహణ యజమాన్యాలకు భారంగా మారింది. ఇప్పటికే రెండు నెలలుగా రైస్‌మిల్లులు నడవకపోవడంతో రైస్‌మిల్లుల్లో నిత్యం పనిచేసే హమాలీలు, ప్లాంట్‌ ఆపరేటర్లు, మెకానిక్‌లు అంతా వలస వెళ్లిపోతున్నారు. దీంతో మిల్లుల యజమానులకు విద్యుత్‌ బిల్లులతో పాటు, మిల్లుల నిర్వహణ భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌కు అనుమతిస్తే తప్ప మిల్లులు నడిచే పరిస్థితి లేదు. దీనికి తోడు ప్రస్తుతం రైతుల వద్ద ఖరీఫ్‌కు సేకరించిన ధాన్యం కూడా రైస్‌మిల్లులకు కేటాయించడంతో రైస్‌మిల్లర్ల వద్ద భారీగా ధాన్యం పేరుకుపోయింది.

50 శాతం రా రైస్‌ తీసుకోవాలి

జిల్లాలో బియ్యం సేకరణ కోసం కేంద్రం అనుమతించింది. 2026 ఫిబ్రవరి 28 వరకు మిల్లర్లు బియ్యం అప్పగించాల్సి ఉంది. ఇప్పటికే 2.35 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అప్పగించారు. మిగతా 2.35 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం రా రైస్‌ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. మిల్లర్లు రా రైస్‌ ఇస్తే నష్టపోయే పరిస్థితి ఉందని వెనుకడుగు వేస్తున్నారు.

– జితేందర్‌రెడ్డి, జిల్లా సివిల్‌సప్లయి అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement