నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్
జగిత్యాల/మల్యాల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శని వారం జగిత్యాల కొండగట్టులో పర్యటించనున్నారు. గతంలో పవన్ కల్యాణ్ వారాహిపూజ సందర్భంగా కొండగట్టులో పర్యటించారు. కొండగట్టు అభివృద్ధికి కృషి చేస్తానని అప్పుడు హామీ ఇచ్చారు. ఈమేరకు ఇటీవల రూ.35.19 కోట్ల టీటీడీ నిధుల ను మంజూరు చేయించారు. ఆ నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. పవన్ క ల్యాన్ హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా కొండగట్టు సమీపంలోని జేఎన్‌టీయూకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు వెళ్లి ప్రత్యేక లపూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
9రోజుల పాటు హోమాలు
జగిత్యాల: లోక కల్యాణార్థం జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీమాన్ నంబి నర్సింహ కౌశిక స్వామి పర్యవేక్షణలో తొ మ్మిది రోజుల పాటు హోమం నిర్వహిస్తున్నట్లు వేద పండితులు తెలిపారు. శుక్రవారం సంపుటీకరణ, శనివారం హనుమాన్ సుప్త హవనం, ఆదివారం హృదయ పారాయణ హవనం, సోమవారం నర్సింహ హవనం, మంగళవారం సుందరకాండ, బుధవారం లక్ష్మీనారాయణ ఇష్టి, గురువారం ఇష్టి మూల మంత్రహవనం, శుక్రవారం యాగం, మహాపూర్ణాహుతి ఉంటుందని వివరించారు. వేద పండితులు నంబి సత్యనారాయణ కౌశిక, నవీన్‌శర్మ, అజ్జు, అజయ్, భార్గవ్, వైభవ్, విష్ణు పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా మెలగాలి
జగిత్యాలటౌన్: వసతి గృహ సిబ్బంది విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె.రాజ్‌కుమార్ అన్నారు. షెడ్యూల్ కులాల వసతి గృహ ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం రూపొందించిన 2026 క్యాలెండర్‌ను శుక్రవారం జగిత్యాలలోని షెడ్యూల్ కు లాల శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల వసతి గృహ పొరుగు సేవల సంఘం నాయకులు రాహుల్, శ్రీకాంత్, కొమురయ్య, లక్ష్మణ్, నరేశ్, స్వప్న, లలిత తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్లకు సత్వర సేవలు
జగిత్యాలటౌన్: పెన్షనర్లకు సత్వర సేవలు అందిస్తామని జిల్లా ట్రెజరీ అధికారి సోఫియా అ న్నారు. తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రూపొందించిన 2026 టేబుల్, గోడ క్యాలెండర్‌లను శుక్రవారం ట్రెజరీ కార్యాలయంలో ఆవిష్కరించారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, సంఘం ప్రతినిధులు అశోక్‌రావు, ప్రకాశ్‌రావు, యాకూబ్, సంజీవరావు, ట్రెజరీ సిబ్బంది పాల్గొన్నారు.
నంచర్ల సహకార సంఘం సీఈవోకు అరుదైన అవకాశం
పెగడపల్లి: పెగడపల్లి మండలం నంచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో రౌతు మధుకర్, స్టాఫ్ అసిస్టెంట్ దొనపాటి రాజశేఖర్‌లకు అరుదైన గౌరవం దక్కింది. సహకార సంఘంలో చేపడుతున్న కామన్ సర్వీసెస్ సెంటర్ల నిర్వహణ, ఎరువుల సరఫరా, ఎరువుల గోడౌన్ నిర్మాణం, ఎరువుల క్రయవిక్రయాలు, సంఘం ఆర్థికాభివృద్ది తదితర అంశాలపై సంఘం అందిస్తున్న కృషిని ప్రశంశిస్తూ జనవరి 26న న్యూ ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర వేడుకలకు మధుకర్, రాజశేఖర్‌లు రావాలని ఆహ్వానం అందింది.
టెట్ అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సు
జగిత్యాలటౌన్: ఖమ్మం సెంటర్‌లో జరిగే టెట్ పరీ క్ష రాసే జగిత్యాల ప్రాంత అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్ సర్వీస్ నడుపుతున్న ట్లు జగిత్యాల డిపో మేనేజర్ కల్పన తెలిపారు. 92555 నంబర్ గల బస్ సర్వీస్ 3వ తేదీ రాత్రి 11.30గంటలకు జగిత్యాల నుంచి బయలు దేరుతుందన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ టికెట్లు బుక్ చేసుకోవచ్చునని తెలిపారు.
నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్
నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్
నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్
నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్


