నిందితులను అరెస్టు చేయాలి
జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: టీఆర్‌నగర్‌లో ఇటీవల ఓ వర్గంపై దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ స్తులు ఆందోళన చేపట్టారు. టీఆర్‌నగర్ గ్రా మానికి చెందిన కొందరు అదే గ్రామానికి చెందినవారిపై నాలుగు రోజుల క్రితం దాడిచేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులు తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితులు శుక్రవారం జగిత్యాల తహసీల్ చౌరస్తాతో పాటు, పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పట్టణ సీఐ కరుణాకర్ హామీ ఇవ్వడంతో శాంతించారు.
స్వర్ణోత్సవాల్లో గోపా ప్రతినిధులు
జగిత్యాల: హైదరాబాద్‌లో జరుగుతున్న గౌడ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్వర్ణోత్సవాల్లో జగిత్యాల జిల్లాశాఖ బాధ్యులు పాల్గొన్నారు. జగిత్యాల గోపా జిల్లా అధ్యక్షుడు దుర్గపు రవీందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి అంబటి రాజయ్య, కోశాధికారి సత్యనారాయణగౌడ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్, గుడాల రాజేశంగౌడ్, సత్తయ్యగౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
కోరుట్ల/జగిత్యాలటౌన్: ప్రజా సమస్యలపై సీసీఐ పోరాటాలు చేస్తోందని జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం అన్నారు. సీపీఐ ఆవిర్భవించి 100ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని సి.ప్రభాకర్ స్మారక భవనం, అల్ల మయ్య గుట్ట ప్రాంతాల్లో సీపీఐ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. సీనియర్ నాయకుడు మౌలానా, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, ఎండీ ముఖ్రం, రాధ పాల్గొన్నారు.
వర్ణ,వర్గ రహిత సమాజమే లక్ష్యం
వర్ణ, వర్గ రహిత సమాజమే లక్ష్యంగా సీపీఐ వందేళ్లుగా పోరాటం సాగిస్తోందని పార్టీ జగిత్యాల పట్టణ కార్యదర్శి మాడిశెట్టి కిరణ్ అన్నారు. పట్టణంలోని టవర్‌సర్కిల్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెన్న మహేశ్, ధర్మన్న, శ్రీగాద దేవదాసు, ఎద్దండి భూమయ్య పాల్గొన్నారు.
నిందితులను అరెస్టు చేయాలి
నిందితులను అరెస్టు చేయాలి


