ఎకరాకు రూ.లక్ష పెట్టిన
ఎకరాకు రూ.లక్ష చొప్పున, రెండు ఎకరాలకు రూ.2లక్షల పెట్టుబడి పెట్టి పసుపు సాగు చేశాను. అధిక వర్షాలతో దుంపకుళ్లు రోగం సోకింది. దాదా పు ఎకరంలో పంట నష్టం జరిగింది. పసుపు పైకి బాగానే కనబడుతున్నప్పటికీ.. పురుగు ఆశించిన మొక్కకు బలం లేకుండా పోయింది. – మామిడి ధర్మారెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి
పంటలో నీళ్లు నిలిచాయి
పసుపు పంట రెండు ఎకరాల్లో సాగు చేసినప్పటికీ అనుకున్న పరిస్థితిలో ఆదాయం వచ్చేలా కనిపించడం లేదు. భూమిలో వర్షానికి నీరు ఆగి, పసుపుకు తెగుళ్లు సోకడంతో దిగుబడులు సగానికి పడిపోనున్నాయి. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
– మారు మురళీధర్‌రెడ్డి, వెల్లుల్ల, మెట్‌పల్లి
దెబ్బతీసిన వర్షాలు
ఈ ఏడాది నెల రోజుల పాటు వర్షాలు కురువడంతో పసుపు పంటకు ఇబ్బందిగా మారింది. నీరు బయటకు వెళ్లలేక, పసుపు పంటలోనే రోజుల తరబడి నీరు నిల్వడంతో దుంపకుళ్లు, అడుగు రోగం సోకి, దిగుబడులు వచ్చేటట్లు కనబడటం లేదు.
– మెక్కొండ రాంరెడ్డి, అలూర్, రాయికల్
ఎకరాకు రూ.లక్ష పెట్టిన
ఎకరాకు రూ.లక్ష పెట్టిన


