రెండోసారి..
సైదాపూర్(హూజూరాబాద్): ఆరెపల్లి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. గ్రామస్తులు పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి తీర్మానించుకున్నారు. ఆరెపల్లి సర్పంచ్ స్థానం జనరల్ మహిళ కాగా.. లొల్లేటి కల్యాణి, వర్నె లావణ్య, వెంగళ కోమల పోటీ పడ్డారు. ఏకగ్రీవానికి గ్రామంలో తీర్మానించుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా వర్నె లావణ్య ఒక్కరే నామినేషన్ వేశారు. 5వ వార్డు సభ్యుడు వెంగళ రవిని ఉప సర్పంచ్‌గా గ్రామంలో తీర్మానించుకున్నారు. 1వ వార్డుకు ఆవునూరి సుజాత, 2వ వార్డుకు లొల్లేటి కల్యాణి, 3వ వార్డుకు వెంగళ కుమార్, 4వ వార్డుకు గుంటి అయిలయ్య, 6వ వార్డుకు మొగిలి లచ్చమ్మ, 7వ వార్డుకు గోంగూల మల్లేశ్వరి, 8వ వార్డుకు వర్నె సతీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


