తెలంగాణకు బలమైన పునాది వేసింది కేసీఆరే..
మెట్‌పల్లిరూరల్/ఇబ్రహీంపట్నం: తెలంగాణకు బలమైన పునాది వేసింది కేసీఆరేనని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలం బర్థీపూ ర్, మెట్‌పల్లి మండలం పెద్దాపూర్, కొండ్రికర్ల గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రైతులు, కార్మికులు, పేదలు, విద్యార్థులు, మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. ముందుగా వర్షకొండలో మల్లన్న జాతర పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు ఎలాల దశరథ్‌రెడ్డి, మెట్‌పల్లి మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు సంగం సాగర్, మామిడి సురేష్‌రెడ్డి, శ్రీనివాస్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, మాజీమంత్రిని కలిసిన వీరాపూర్ పాలకవర్గం
రాయికల్: రాయికల్ మండలం వీరాపూర్ సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి, ఉపసర్పంచ్ దుంపల నర్సారెడ్డి, వార్డు సభ్యులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డిని సోమవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సీనియర్ నేత జీవన్‌రెడ్డిని, సంజయ్‌కుమార్‌ను కలుసుకున్నారు. ఒక నేతను కలిసి మరో నేతను కలవకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇలా జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్, సారంగాపూర్, జగిత్యాల మండలాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచులు ఈ ఇద్దరు నేతలను కలుసుకుంటున్నారు.
ఎమ్మెల్యే సంజయ్, మాజీమంత్రి జీవన్‌రెడ్డితో ఏకగ్రీమైన సర్పంచ్, వార్డు సభ్యులు
తెలంగాణకు బలమైన పునాది వేసింది కేసీఆరే..
తెలంగాణకు బలమైన పునాది వేసింది కేసీఆరే..


