అభివృద్ధి పనులే గెలిపిస్తాయి
మెట్‌పల్లిరూరల్: కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్‌పల్లి మండలం వేంపేటలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి తరఫున ఆదివారం ప్రచారం చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, రమేశ్ పాల్గొన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్


