నెలన్నరైనా డబ్బులు రాలే..
నేను 10 క్వింటాళ్ల మొక్కజొన్నలను అమ్మి నెలన్నర అవుతోంది. రూ.24వేలు రావాల్సి ఉంది. డబ్బులు రాకపోతే.. యాసంగికి పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి. డబ్బులు ఖాతాలో పడ్డాయని ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి చూడాల్సి వస్తోంది.
– పాతూరి శ్రీనివాస్ రెడ్డి, రాయికల్
త్వరలో డబ్బులు
మరో నాలుగైదు రోజుల్లో మొక్కజొన్న రైతులకు డబ్బులు చెల్లిస్తాం. ప్రభుత్వం నుంచి మార్క్‌ఫెడ్ సంస్థకు డబ్బులు రావాల్సి ఉంది. రాగానే ఆలస్యం చేయకుండా వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. రైతులు సహకరించాలి.
– ఎండీ.హబీబ్, మార్క్‌ఫెడ్ జిల్లా అధికారి
నెలన్నరైనా డబ్బులు రాలే..


