మహాశివునికి పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

మహాశివునికి పంచామృతాభిషేకం

Dec 8 2025 8:12 AM | Updated on Dec 8 2025 8:12 AM

మహాశి

మహాశివునికి పంచామృతాభిషేకం

జగిత్యాలరూరల్‌: పొలాస శివారులోని సహస్ర వెయ్యి లింగాల దేవాలయంలో మహాశివునికి అన్నపూజ, మహాగణపతికి పంచామృతాభిషేకాలు చేశారు. ఆరుద్ర నక్షత్రం సంకటహర చతుర్థి పురస్కరించుకుని మహాదేవునికి అభిషేకాలు చేశారు. వేలాది మంది భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు నలమాసు గంగాధర్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మహా గణపతికి పూజలు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధం మహాగణపతికి సంకటహర చతుర్థి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్‌శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

జగ్గాసాగర్‌లో పోలీసుల కవాతు

మెట్‌పల్లిరూరల్‌: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించడానికి పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నామని మెట్‌పల్లి సీఐ అనిల్‌ అన్నారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో ఆదివారం ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ ఎస్సైలు కిరణ్‌కుమార్‌, రాజు నాయక్‌, అనిల్‌, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి అభ్యర్థి లెక్కలు చూపించాల్సిందే

జగిత్యాలరూరల్‌: ప్రతి అభ్యర్థి లెక్కలు చూపించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు మనోహర్‌ అన్నారు. జగిత్యాలరూరల్‌ మండలంలో పోటీచేసే సర్పంచ్‌, వార్డు అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, ఖర్చులపై ఆదివా రం అవగాహన కల్పించారు. అభ్యర్థులు ఎన్ని కల నియమావళి పాటించాల్సిందేనన్నా రు. రూరల్‌ సీఐ సుధాకర్‌ మాట్లాడుతూ అభ్యర్థులు గ్రామాల్లో అనుమతి తీసుకున్నాకే.. సమావేశాలు, మైకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎంపీడీవో రమాదేవి, రూరల్‌ ఎస్సై ఉమాసాగర్‌ పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక

మల్లాపూర్‌: మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌–డివిజన్‌ కార్యలయంలో మంగళవారం విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక(లోకల్‌ కోర్టు) సమావేశాన్ని నిర్వహించనున్నట్లు విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం(సీజీఆర్‌ఎఫ్‌) చైర్మన్‌ ఎరుకల నారాయణ, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్‌ ఏడీఈ అమరేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌శాఖ సబ్‌ డివిజన్‌ పరిధిల్లోని మల్లాపూర్‌, రాఘవపేట, ఇబ్రహింపట్నం, మేడిపల్లి(పడమర) సెక్షన్ల సంబంధిత గ్రామాల రైతులు, గృహ, వాణిజ్య, వ్యాపార వినియోగదారులు హాజరుకావాలని సూచించారు.

మహాశివునికి    పంచామృతాభిషేకం1
1/3

మహాశివునికి పంచామృతాభిషేకం

మహాశివునికి    పంచామృతాభిషేకం2
2/3

మహాశివునికి పంచామృతాభిషేకం

మహాశివునికి    పంచామృతాభిషేకం3
3/3

మహాశివునికి పంచామృతాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement