ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్, కొత్తపేట, అల్లీపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను మంగళవారం పరిశీ లించారు. జిల్లాలో రెండో విడతలో ఏడు మండలాల్లో 144 గ్రామాలు, 1276 వార్డులకు నా మినేషన్ల స్వీకరణ గడువు పూర్తయిందన్నారు. పొరపాట్లు జరగకుండా నామినేషన్లు తీసుకున్న వారి దరఖాస్తు ఫారాలను వివరాలతో రిజిస్ట్రేషన్ నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లను ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపించాలని ఆదేశించారు. హెల్ప్‌డెస్క్, పోలీసు బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు. ఈనెల 3న పరిశీలన ఉంటుందని, 6 వరకు ఉ పసంహరణ గడువు ఉంటుందన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ‘రెడ్కో’ మేనేజర్
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇందిరా వనరుల సంస్థ రెడ్కో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్‌గా రిటైర్డ్ ఏడీఈ దుర్శెట్టి మనోహర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
జిల్లాలో పోలీస్‌యాక్ట్ అమలు
జగిత్యాలక్రైం: శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 31 వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రజ లు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
బెట్ట పరిస్థితి ఏర్పడితేనే మామిడిలో పూత
జగిత్యాలఅగ్రికల్చర్: బెట్ట పరిస్థితులు ఏర్పడితేనే మామిడిలో పూత వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారి కె. స్వాతి తెలిపారు. జగిత్యాలరూరల్, రాయికల్ మండలంలోని మామిడి తోటలను మంగళవారం పరిశీలించారు. ఈ ఏడు అధిక వర్షాలతో భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, ఫలితంగా పూత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, 10 గ్రాముల పోటాషియం నైట్రేట్, రెండు గ్రాముల బోరాన్, రెండు గ్రాముల జింక్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలని, తద్వారా పూత వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.
డీసీసీ అధ్యక్షుడికి నియామకపత్రం
జగిత్యాలటౌన్: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య హాజరయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ నందయ్యకు డీసీసీ అధ్యక్ష నియామకపత్రం అందించారు. నందయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి


