● ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఇవ్వండి ● సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సత్యం
మల్యాల: మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించారు. షార్ట్ సర్క్యూట్‌తో 30 దుకాణాలు దగ్ధమయ్యాయని, సర్వం కోల్పోయి రోడ్డు పడ్డారని, మంటల్లో సామగ్రితోపాటు విలువైన పత్రాలు కాలిపోయాయని వివరించారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున అందించాలని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి, ఎమ్మెల్యే తెలిపారు.
మద్యం దుకాణాలు
ప్రారంభం
జగిత్యాలక్రైం: మద్యం షాపుల లైసెన్స్ పొందిన 72 మంది వ్యాపారులు సోమవారం దుకాణాలను ప్రారంభించారని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. వీరంతా గతనెల 29, 30 తేదీల్లో సుమారు రూ.6 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త మద్యం షాపుల నిర్వాహకులు మరో రెండుమూడు రోజుల్లో భారీగా మద్యం కొనుగోలు చేయనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్ని కల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే కొన్ని చోట్ల భారీగా మద్యం నిల్వ చేసుకోగా.. మరికొంత మంది పెద్ద ఎత్తున మ ద్యం కొనుగోలు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రా మాల్లో భారీగా మద్యానికి డిమాండ్ పెరిగింది.
చీరల పంపిణీపై ఈసీ పునఃసమీక్షించాలి
జగిత్యాలటౌన్: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రారంభమైన చీరల పంపిణీని యథా విధిగా కొనసాగించేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్డులో మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ట్రాఫిక్ సమస్య నివారించాలని హైదరాబాద్‌లో డీటీసీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో ఇళ్లు పొందిన లబ్ధిదారులు వెంటనే తమకు కేటాయించిన ఇళ్లలో చేరాలని కోరారు. నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, మన్సూర్, రఘువీర్‌గౌడ్, గుండ మధు, రమేష్‌రావు, నేహాల్ ఉన్నారు.
మక్కల తరలింపు
రాయికల్: పట్టణంలోని మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్ ద్వారా తూకం వేసిన బస్తాలను చల్‌గల్ ఏఎంసీకి తరలించినట్లు సెంటర్ ఇన్‌చార్జి మల్లికార్జున్ తెలిపారు. గతనెల 30న ‘మక్కలు కొంటలేరు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన కేంద్రంలో ఉన్న మొక్కజొన్న బస్తాలను ఏడు లారీల్లో చల్‌గల్ ఏఎంసీకి తరలించారు. మంగళవారం నుంచి మక్కలు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇతర మండలాల నుంచి రైతులు రావడంతో ఆలస్యమైందని వివరించారు.
ప్రమాద బాధితులను ఆదుకోండి
ప్రమాద బాధితులను ఆదుకోండి


