పుట్టినరోజు కానుక
మా నాన్న నాకు పుట్టినరోజు కానుకగా ఫోన్ కొనిచ్చాడు. కంప్యూటర్ క్లాస్‌కు వెళ్లే క్రమంలో ఫోన్ పోయింది. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సీఈఐఆర్ యాప్‌లో నమోదు చేశారు. పోలీసుల కృషితో నా సెంటిమెంట్ ఫోన్ నాకు వచ్చింది. – రమ్య, తిప్పన్నపేట,
జగిత్యాలరూరల్ మండలం
పొలం వద్ద దొంగిలించారు
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన సమయంలో ద్విచక్రవాహనం నుంచి నా ఫోన్ దొంగిలించారు. బుగ్గారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మొబైల్ ఐఎంఈఐ నంబర్‌తో సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసి ట్రాకింగ్ చేసి నాకు అప్పగించారు.
– తిరుపతి, బుగ్గారం
చార్జింగ్ పెడితే ఎత్తుకెళ్లారు
నా చెల్లి జ్యోతి అత్తగారింటికి వెళ్తున్న సమయంలో బస్టాండ్‌లో ఫోన్‌కు చార్జింగ్ పెట్టింది. ఎవరో ఆ ఫోన్‌ను దొంగిలించారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్ చేసి నా ఫోన్‌ను అప్పగించారు. ఆనందంగా ఉంది.
– లక్ష్మణ్, జగిత్యాల
పుట్టినరోజు కానుక
పుట్టినరోజు కానుక


