మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు
● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన లక్ష్మిపూర్ రైతులు
జగిత్యాలఅగ్రికల్చర్: కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదంటూ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ రైతులు సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. లక్ష్మీపూర్ ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో లక్ష్మీపూర్, తిమ్మాపూర్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపించినా తీసుకోవడం లేదని, ఒకవేళ బలవంతంగా దించుకుంటే బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. లక్ష్మీపూర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు రూ 1.50కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. లక్ష్మీపూర్ ఎఫ్‌పీవో అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, సంఘ సభ్యులు లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డి, బుచ్చిరెడ్డి, శివ, రాజేశ్వర్ రెడ్డి, పోచయ్య, కుమార్ ఉన్నారు


