మహమ్మారి నివారిద్దాం
● యువత జాగ్రత్తగా ఉండాలి ● అదనపు కలెక్టర్ రాజాగౌడ్
జగిత్యాల: ఎయిడ్స్ మహమ్మారికి చికిత్స కంటే నివారణే మేలు అని, యువత జాగ్రత్తగా ఉండాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ నుంచి కొత్తబస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. మహమ్మారికి చికిత్స లేదన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 2,573 బాధితులు ఉన్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు శ్రీనివాస్, ఐఎంఏ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, సుధీర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.


