రైతు ఇంటా.. పసిడి పంట | - | Sakshi
Sakshi News home page

రైతు ఇంటా.. పసిడి పంట

Dec 1 2025 9:26 AM | Updated on Dec 1 2025 9:26 AM

రైతు

రైతు ఇంటా.. పసిడి పంట

● జిల్లాలో 35 వేల ఎకరాల్లో సాగు ● పసుపు పంటతోనే ఆర్థికంగా ఎదిగామంటున్న రైతులు

ఏటా సాగు చేస్తా

సాగు విస్తీర్ణం పెరిగింది

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో రైతులు పసుపును ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. పంట కాలం దాదాపు 9 నెలలు ఉండటంతో ఏ గ్రామంలో చూసినా రోడ్ల వెంట పచ్చని పసుపు తోటలే స్వాగతం పలుకుతూ కనిపిస్తాయి. పంటను తవ్వడం నుంచి ఉడికించడం, మార్కెట్‌కు తరలించే సమయంలో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

35,230 ఎకరాల్లో..

ఉద్యానశాఖ అంచనా ప్రకారం జిల్లాలో 35,230 ఎకరాల్లో పసుపు సాగయింది. గతేడాది పసుపు క్వింటాల్‌కు రూ.15 వేల వరకు పలకడంతో కొంత విస్తీర్ణం పెరిగింది. అత్యధికంగా ఈ పంటను మెట్‌పల్లిలో 6,196, మల్లాపూర్‌ 5,123, ఇబ్రహీంపట్నం 5,121, జగిత్యాలరూరల్‌ 3,202, కోరుట్ల 2,684, రాయికల్‌ 2,380, కథలాపూర్‌ 2,354, మేడిపల్లిలో 1,557 ఎకరాల్లో వేశారు.

రేటు ఉన్నా.. లేకున్నా..

జిల్లావ్యాప్తంగా మెజార్టీ గ్రామాల్లో పసుపు సాగు చేస్తుంటారు. పంటకు రేటు ఉన్నా, లేకున్నా అర ఎకరం నుంచి నాలుగైదు ఎకరాల వరకు సాగు చేయడం ఆనవాయితీగా వస్తుంది. విత్తనాన్ని కొనకుండా గతేడాది పంట నుంచి సేకరిస్తారు. కనీసం ఒక్కో రైతు 25 నుంచి 200 క్వింటాళ్లు పండిస్తాడు. ఏదైనా అశుభాలు జరిగినప్పుడు ఏ రైతూ తోటలోకి వెళ్లరు. పంట దిగుబడిని జగిత్యాల, మెట్‌పల్లి, నిజమాబాద్‌, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లకు తీసుకెళ్తారు. జిల్లాలో ఎర్ర నేలలు అనుకూలంగా ఉండడం, నాణ్యతో కూడిన దిగుబడులు రావడంతో ఇక్కడి పసుపునకు మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది.

ఆదాయంతో అమెరికాకు..

పసుపు ద్వారా మంచి ఆదాయం వస్తుండడంతో రైతులు గ్రామాల్లో అందమైన భవంతులు నిర్మించడంతో పాటు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి అమెరికా, లండన్‌, కెనడా దేశాలకు పంపిస్తున్నారు. తోటల్లో పనిచేసేటప్పుడు రైతు దంపతులు బురద దోవతి, మాసిన చీరతో కనిపిస్తారు. ఇంటికి వద్ద కారు, తెల్లదోవతి, తెల్ల అంగి, పచ్చ టవల్‌తో రైతు, రైతు భార్య మెడ చుట్టూ బంగారు కంటె, చెవులు ఊడిపడేలా బంగారు పోగులతో కనబడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది.

పసుపు పంటకు రేటు ఉన్నా, లేకున్న రెండెకరాల్లో సాగు చే స్తుంటా. మిగతా పంటల ద్వా రా వచ్చే ఆదాయం ఖర్చులకు పోగా, పసుపు పంట ఆదాయం మిగులుతుంది.

– కాసారపు భూమారెడ్డి, మల్లాపూర్‌

జిల్లాలో వరి, మొక్కజొన్న తర్వాత పసుపు ప్రధాన పంట. గతేడాది రేటు పెరగడంతో పసుపు సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సేంద్రియ ఎరువులు వాడి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. – శ్యాంప్రసాద్‌,

జిల్లా ఉద్యానశాఖ అధికారి

రైతు ఇంటా.. పసిడి పంట1
1/2

రైతు ఇంటా.. పసిడి పంట

రైతు ఇంటా.. పసిడి పంట2
2/2

రైతు ఇంటా.. పసిడి పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement