ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి
జగిత్యాలరూరల్: గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్ వేసే అభ్యర్థులు ఖర్చు వివరాలను ఎన్నికల అనంతరం తప్పకుండా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు మనోహర్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్‌మండలం చల్‌గల్ నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యర్థులు నామినేషన్ పత్రాలను, వారి బ్యాంకు వివరాలను పొందుపర్చాలన్నారు. ఎన్నికల సమయంలో రోజూ చేసిన ఖర్చును ఎన్నికల తర్వాత సమర్పించాలని సూచించారు.
మొన్న జెడ్పీటీసీ.. నేడు సర్పంచ్‌గా నామినేషన్
జగిత్యాలరూరల్: జగిత్యాల జెడ్పీటీసీగా మొన్నటి వరకు సంగెపు మహేశ్ పనిచేశారు. ఇటీవలే పదవీకాలం పూర్తయింది. కాగా, జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్ కావడంతో ఆదివారం సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. జెడ్పీటీసీ చేసిన వ్యక్తి సర్పంచ్‌గా బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది.
అభ్యర్థులకు సమాచారం అందించాలి
జగిత్యాలరూరల్: నామినేషన్ కేంద్రాల వద్దకు వచే అభ్యర్థులకు సరైన సమాచారం అందించాలని డిప్యూటీ సీఈవో నరేష్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాం నామినేషన్ కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. అభ్యర్థులకు నామినేషన్‌పత్రాలు అందించడంతోపాటు సరైన వివరాలు పొందుపర్చేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. నామినేషన్ పత్రాలు తీసుకుంటున్న సమయంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి


