సకాలంలో నామినేషన్ రిపోర్టులు పంపించాలి
సారంగాపూర్(జగిత్యాల): నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంతోపాటు, రేచపల్లి, లక్ష్మీదేవిపల్లి రెండో దశ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని పేర్కొన్నారు. ప్రతీ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థుల సందేహాలను సిబ్బంది నివృత్తి చేసి అవసరమైన సహకారం అందించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వాహిదొద్దీన్, ఎంపీడీవో సలీం తదితరులు ఉన్నారు.
ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు.


