చికిత్స పొందుతూ వివాహిత మృతి
జమ్మికుంట: ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ చెందిన పాతకాల విజయరాణి(35) కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగింది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెకు భర్త కిరణ్, ముగ్గురు కొడుకులున్నారు. గంగారపు చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
దేశరాజ్‌పల్లి వాసి..
రామడుగు: దేశరాజ్‌పల్లి గ్రామానికి చెందిన కొత్త రేణుక(38) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రేణుక కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. భర్త రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
తాళం వేసిన ఇళ్లలో చోరీ
కోరుట్ల: కోరుట్ల పట్టణంలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు.. పట్టణంలోని రవీంద్రారోడ్‌లో ఇల్లుటపు భూమయ్య ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. జూనియర్ కళాశాల గ్రౌండ్ వద్ద కటుకం రాజారాం ఇంటి తాళాలు పగులగొట్టి కబ్బోర్డ్‌లోని ఐదు బంగారు ఉంగరాలు, ఒక జత చెవి కమ్మలు, కాళ్ల కడియాలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
వీణవంక: బేతిగల్, కనపర్తి, వల్భాపూర్ గ్రామాల రైతులకు చె ందిన వ్యవసాయ బా వుల సర్వీస్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రైతు ల వివరాల ప్రకారం.. సుమారు పది మంది రైతుల వ్యవసాయ బా వుల వద్ద స్టార్టర్ నుంచి విద్యుత్ మోటార్ వరకు వెళ్లే సర్వీస్ వైర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం రై తులు గమనించి డయ ల్ 100కు ఫోన్ చేశా రు. బేతిగల్‌కు చెందిన ఓ రైతు బోరు మెటార్ వైరు రూ.3వేల విలువ ఉంటుందని, మరో రైతు వైరు రూ.1,500 ఉంటుందని వాపోయారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు.


