
మట్టి విగ్రహాలకు కేరాఫ్ బొమ్మకల్
కరీంనగర్‌రూరల్: మట్టి విగ్రహాల తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా బొమ్మకల్ మారింది. 14 ఏళ్ల నుంచి బొమ్మకల్ బైపాస్‌లో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో కొంతమంది యువకులు గాయత్రి పర్యావరణ సంస్థను ప్రారంభించి పీవోపీ విగ్రహాలతో కలుగుతున్న అనర్థాలపై ప్రచారం చేపట్టారు. అనంతరం సంస్థ సభ్యుడైన తోట కిరణ్‌కుమార్ 2011 నుంచి బొమ్మకల్ ఫ్‌లైఓవర్ వంతెన వద్ద మట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కలకత్తా కళాకారులతో వినాయక, దుర్గామాత విగ్రహాలను తయారు చేయిస్తున్నాడు. 2 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలున్నాయి.
మట్టి విగ్రహాలకు ఆదరణ
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మొగ్గుచూపుతున్నారు. పదేళ్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. 14 ఏళ్ల నుంచి వివిధ రూపాల్లో మట్టి ప్రతిమలను రూపొందిస్తున్నాం.
– తోట కిరణ్‌కుమార్, నిర్వాహకుడు

మట్టి విగ్రహాలకు కేరాఫ్ బొమ్మకల్